Begin typing your search above and press return to search.

మోడీ.. జిన్ పింగ్ ల మ‌ధ్య మూవీ ముచ్చ‌ట్లు

By:  Tupaki Desk   |   29 April 2018 5:23 AM GMT
మోడీ.. జిన్ పింగ్ ల మ‌ధ్య మూవీ ముచ్చ‌ట్లు
X
ఇద్ద‌రు దేశాధినేత‌ల మ‌ధ్య మీటింగ్ అంటే.. ఏయే అంశాలు వ‌స్తాయ‌న్న ప్ర‌శ్న వేస్తే.. భారీ లిస్ట్ చెబుతారు. కానీ.. అందులో సినిమాల గురించి మాట్లాడుకునే అవ‌కాశం ఉంద‌న్న మాట మాత్రం చెప్ప‌లేరు. కానీ..అలాంటి ఉదంత‌మే చోటు చేసుకొని ఆస‌క్తిక‌రంగా మారింది. ఇద్ద‌రు దేశాధినేత‌ల మ‌ధ్య సీరియ‌స్ ఇష్యూలు ప‌క్క‌కు వెళ్లి.. సినిమాల గురించి మాట్లాడుకోవ‌టం ఇప్పుడు అంద‌రి దృష్టిని ఆక‌ర్షిస్తోంది.

పైకి ఫ్రెండ్లీగా ఉంటూనే.. లోలోప‌ల గిల్లి.. గిచ్చే త‌త్త్వం ఉన్న చైనాకు.. డ్రాగ‌న్ తో మంచి సంబంధాలు కోరుకునే భార‌త్ కు మ‌ధ్య రిలేష‌న్ ఎంత ప్ర‌య‌త్నించినా.. ఒక ప‌ద్ధ‌తిలో ఉండ‌క‌పోవ‌టం తెలిసిందే. లోప‌ల ఎన్ని ఉన్నా.. పైకి మాత్రం మ‌ర్యాద‌ను ప్ర‌ద‌ర్శించుకునే చైనా.. తాజాగా భార‌త ప్ర‌ధాని మోడీ త‌మ దేశంలో ప‌ర్య‌టిస్తున్న సంద‌ర్భంగా ఏర్పాట్లు భారీగా చేసింది.

దేశానికి వ‌చ్చే దేశాధినేత‌ల‌తో స‌ర‌దాగా వాహ్యాళికి తీసుకెళ్లిన‌ట్లుగా ప్లాన్ చేసే మోడీ తీరుకు త‌గ్గ‌ట్లే.. తాజా చైనా ప‌ర్య‌ట‌న సంద‌ర్భంగా మోడీని తీసుకొని బోటు షికారుకు బ‌య‌లుదేరారు చైనా అధ్య‌క్షుడు జిన్ పింగ్‌. ఒకే బోటులో కూర్చున్న ఈ ఇద్ద‌రు అధినేత‌లు.. ఆ స‌మ‌యంలో మాట్లాడుకున్న మాటల్లో వ‌చ్చిన అంశాన్ని చూస్తే ఆశ్చ‌ర్య‌పోవ‌టం ఖాయం. ఎవ‌రూ ఊహించ‌ని రీతిలో ఈ ఇద్ద‌రు అధినేత‌ల మ‌ధ్య హిందీ సినిమాల ముచ్చ‌ట వ‌చ్చింది.

తాను అమీర్ ఖాన్ న‌టించిన దంగ‌ల్ మూవీని చూసిన‌ట్లుగా మోడీకి జిన్ పింగ్ చెప్ప‌ట‌మే కాదు.. ఆ సినిమా బాగా న‌చ్చింద‌న్నారు. గ‌త ఏడాది చైనాలో దాదాపు రూ.1100 కోట్లు వ‌సూలు చేసిన ఈ సినిమా త‌న‌కు న‌చ్చిన‌ట్లుగా జిన్ పింగ్ చెప్పటం గ‌మ‌నార్హం. గ‌తంలో తాను ఎన్నో భార‌తీయ సినిమాలు చూశాన‌ని.. అందులోహిందీ.. ఇత‌ర ప్రాంతీయ భాష‌ల సినిమాలు ఉన్న‌ట్లుగా మోడీకి చెప్పారు. రానున్న రోజుల్లో మ‌రిన్ని భార‌తీయ సినిమాలు చైనాలో.. చైనీస్ మూవీస్ భార‌త్ లో ప్ర‌ద‌ర్శిస్తే బాగుంటుంద‌న్న అభిప్రాయం వ్య‌క్తం చేసిన‌ట్లు చెబుతున్నారు. సినిమా సొల్లు అనే వారికి.. ఇద్ద‌రు దేశాధినేత‌లు సినిమాల గురించి మాట్లాడుకోవ‌టం ఆస‌క్తిక‌ర అంశంగా చెప్ప‌క త‌ప్ప‌దు.