Begin typing your search above and press return to search.

స్కిల్ ఇండియా కాదు..ఎస్-కిల్ ఇండియా:రాహుల్

By:  Tupaki Desk   |   26 Sep 2018 2:28 PM GMT
స్కిల్ ఇండియా కాదు..ఎస్-కిల్ ఇండియా:రాహుల్
X
మ‌రి కొద్ది నెల‌ల్లో సార్వ‌త్రిక ఎన్నిక‌లు ద‌గ్గ‌ర‌ప‌డుతున్న నేప‌థ్యంలో దేశ రాజ‌కీయాలు ఒక్క‌సారిగా వేడెక్కాయి. గెలుపే ప‌ర‌మావ‌ధిగా అధికార బీజేపీ - ప్ర‌తిప‌క్ష కాంగ్రెస్ లు అస్త్ర‌శ‌స్త్రాల‌ను సిద్ధం చేసుకుంటున్నాయి. పార్ల‌మెంటులో బీజేపీ స‌ర్కార్ పై అవిశ్వాస తీర్మానం సంద‌ర్భంగా ప్ర‌ధాని మోదీపై రాహుల్ సంధించిన వ్యంగ్యాస్త్రాలు - హ‌గ్ ఎపిసోడ్ ...వైర‌ల్ అయిన సంగ‌తి తెలిసిందే. ఇక, తాజాగా రాఫెల్ వ్య‌వ‌హారంలో బీజేపీని కాంగ్రెస్ అధ్య‌క్షుడు రాహుల్ గాంధీ దుయ్య‌బడుతున్నారు. వ‌రుస ట్వీట్లతో మోదీని ఇర‌కాటంలో పెట్టేందుకు ప్ర‌య‌త్నిస్తున్నారు. తాజాగా, మోదీపై రాహుల్ మ‌రో సంచ‌ల‌న ట్వీట్ చేశారు. మోదీపై విమర్శల జోరును పెంచుతోన్న రాహుల్....బుధవారంనాడు మోదీ స్కిల్ ఇండియాపై సెటైర్ వేశారు. అది `స్కిల్‌` ఇండియా క్యాంపెయిన్ కాద‌ని... ఎస్‌-కిల్‌ ఇండియా అని స‌రికొత్త నిర్వ‌చ‌న‌మిస్తూ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.

`రాఫెల్`ఉదంతం బీజేపీని అత‌లాకుతలం చేస్తోన్న సంగ‌తి తెలిసిందే. ఫ్రాన్స్ మాజీ అధ్య‌క్షుడు హోలాండ్ వ్యాఖ్య‌లు....కాంగ్రెస్ కు పాశుప‌తాస్త్రంలా దొరికాయి. బీజేపీ ఒత్తిడితోనే రిల‌య‌న్స్ ను ఆ ఒప్పందంలో భాగ‌స్వామి అయింద‌ని హోలాండ్ చేసిన వ్యాఖ్య‌లు బీజేపీని ఇర‌కాటంలో పెట్టాయి. ఫ్రెంచ్ రిపోర్ట‌ర్ల‌కు కేంద్ర‌మంత్రి స‌మాధానం ఇవ్వ‌లేక వారిని మీడియా స‌మావేశం నుంచి వెళ్లిపొమ్మ‌న్నారంటే....బీజేపీ ఎంత ఒత్తిడికి లోన‌యిందో అర్థ‌మ‌వుతోంద‌ని కాంగ్రెస్ విమ‌ర్శిస్తోంది. విమానాల తయారీలో ఏమాత్రం అనుభ‌వం - నైపుణ్యం లేని కంపెనీకి రూ.30వేల కోట్ల‌ కాంట్రాక్టును ఎలా అప్పగించారని రాహుల్ ధ్వ‌జ‌మెత్తారు. ఆ ఒప్పందం వ‌ల్ల‌ నైపుణ్యం కలిగిన యువత నిరుద్యోగుల‌య్యార‌ని విమ‌ర్శించారు. ఎస్‌-కిల్‌ ఇండియా కార్యక్రమం ద్వారా హాల్‌(హిందుస్థాన్‌ ఏరోనాటిక్స్‌ లిమిటెడ్‌)కు రావాల్సిన రూ.30వేల కోట్లను ప్రధాని లాక్కున్నార‌ని రాహుల్ ఎద్దేవా చేశారు. రాఫెల్‌ డీల్‌ తోపాటు విజయ్‌ మాల్యా లండ‌న్ చెక్కేయ‌డం వెనుక ఉన్న‌ వాస్తవాలు త్వరలోనే బయటకొస్తాయని రాహుల్ అన్నారు.