Begin typing your search above and press return to search.

ప్రతి ఒక్కరూ విధిగా పాలు తాగాలని ప్రధాని సూచన... ఎందుకంటే?

By:  Tupaki Desk   |   25 Dec 2021 1:30 PM GMT
ప్రతి ఒక్కరూ విధిగా పాలు తాగాలని ప్రధాని సూచన... ఎందుకంటే?
X
కరోనా వైరస్ ప్రపంచంలోని ఒక్కొక్క దేశాన్ని ఒక్కొక్క విధంగా దెబ్బకొట్టింది. అయితే జపాన్ లో మాత్రం కరోనా వైరస్ కొట్టిన దెబ్బ ఇంకోలా ఉంది. వైరస్ వ్యాప్తి చెందకుండా దేశంలో లక్డౌన్ విధించారు. ఆ సంక్షోభ సమయంలో ప్రభుత్వం అధికారులు పౌరులకు కావాల్సిన కనీస అవసరాలను విధిగా అందించేందుకు తీసుకున్న చర్యలు ప్రస్తుతం వారి మెడకు చుట్టుకున్నాయి. తాజాగా వెలుగు చూసిన ఒక అంశం అంతర్జాతీయ ప్రపంచాన్ని నవ్వుకునేలా చేస్తుంది.

ఆ అంశం ఏమిటంటే జపాన్ లో పాలు అధికంగా ఉన్నాయని ఇందుకుగాను ప్రజలందరూ ఈ రోజు పాలు తీసుకోవాలని అక్కడి ప్రభుత్వం వారికి సూచించింది. దీనిలో భాగంగానే మరో విషయాన్ని కూడా ప్రభుత్వం స్పష్టం చేసింది. రోజు పాలు తీసుకునే వారు ఎలాగూ తీసుకుంటారు.. అలానే పాలు తాగని వారు కూడా కొనుగోలు చేయాలని సూచించింది.

ఇది ఏంటి వింత సూచన అని అనుకుంటున్నారా? అవును ఇది కేవలం సూచన మాత్రమే... పాలు తాగడం అనేది ప్రతి వ్యక్తికి ఉన్న ఇష్టాల పై ఆధారపడి ఉంటుంది. వారికి తాగాలి అనిపిస్తే తాగుతారు. లేకపోతే తాగారు. కానీ జపాన్ ప్రభుత్వం చెప్పిన దాని ప్రకారం ఇష్టం ఉన్నా లేకపోయినా కనీసం బాధ్యతగా అయినా పాలను తీసుకోవాలని సూచిస్తుంది. అసలు ఈ పాలకు, ప్రభుత్వానికి సంబంధం ఏంటి అని ఆలోచన మీకూ వస్తుంది కదా? దీనికి గల ప్రధాన కారణం ఏంటో ఇప్పుడు చూద్దాం.

ప్రభుత్వ అధికారులు చెప్పిన దాని ప్రకారం జపాన్ దేశంలో పాలు డిమాండ్ కంటే ఎక్కువగా ఉన్నాయి. ఈ నిల్వలు పెరగడానికి ఓ కారణం కూడా ఉంది. జపాన్ లు వైరస్ వ్యాప్తి అంతకంతకూ వ్యాప్తి చెందుతుండడంతో అధికారులు అడ్డుకునేందుకు లాక్ డౌన్ విధించారు. ఈ క్రమంలో దేశవ్యాప్తంగా ఉండే వివిధ గ్రామాలు, పట్టణాల నుంచే పాలను పెద్ద ఎత్తున సేకరించారు. సాధారణంగా ఇలా సేకరించిన పాలను పాఠశాలలో ఉండే విద్యార్థులకు ఉచితంగా అందిస్తారు.

అది వారి ప్రాధమిక హక్కు. అయితే లాక్ డౌన్ విధించడంతో పాఠశాలలో కళాశాలలో అన్ని మూతపడ్డాయి. దీంతో పాల నిల్వలు అమాంతం పెరిగాయి. సుమారు 50 లక్షల లీటర్ల పైనే ఉంటాయని అధికారులు చెప్పారు. వీటిని డిసెంబర్ 21 లోపు ఖర్చు చేయక పోతే వృధా అవుతాయని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే దేశ ప్రజలు పాలను ఎక్కువగా వినియోగించాలని అక్కడి ప్రభుత్వం సూచించింది. ఇందుకోసం ఏకంగా ఆ దేశ ప్రధానమంత్రి బయటకు వచ్చి ప్రజలందరూ పాలను తాగాలని చెప్పారు.

ఇలా ఆ దేశ ప్రధానమంత్రి బయటకు వచ్చే పాలు తాగాలని సూచించడానికి కొన్ని కారణాలు ఉన్నాయి. డిమాండ్కు సరిపడా పాల ఉత్పత్తి ఉంటే ఆర్థిక వ్యవస్థ స్థిరంగా కొనసాగుతోంది. కానీ అంతకు మించి ఉండడం కారణంగా ఆ దేశంలో ఉండే డైరీలు క్షీణించే స్థితికి చేరుకున్నాయి. దీంతో ప్రభుత్వంపై అధిక భారం పడింది. తక్షణ చర్యల్లో భాగంగా పాలను ప్రతి ఒక్కరూ తీసుకొని ఆర్థిక వ్యవస్థను నిలబెట్టాలని ప్రధాని కోరారు. ఇదిలా ఉంటే పాలను ఎక్కువ తీసుకోవాలని మరికొంతమంది ప్రముఖులు కూడా సూచించారు. ఇందుకోసం ప్రభుత్వం బ్రాండ్ అంబాసిడర్ లను కూడా నియమించింది.