Begin typing your search above and press return to search.
అద్భుతం...ప్రధాని కోసం ప్రత్యేక సొరంగం!
By: Tupaki Desk | 5 Feb 2020 2:00 PM GMTదేశ రాజధాని ఢిల్లీలో ట్రాఫిక్ జామ్ ల గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. పార్లమెంటు మొదలుకొని పలు పర్యాటక ప్రాంతాలున్న ఢిల్లీలో వేలకొద్దీ వాహనాలు ప్రయాణిస్తుంటాయి. అయితే, ముఖ్యంగా ప్రధానితో పాటు పలు వీవీఐపీలు ప్రయాణిస్తున్న వేళ సామాన్యుల వాహనాలకు బ్రేక్ లు పడక తప్పని పరిస్థితి. భద్రతా కారణాల రీత్యా...వీవీఐపీల కాన్వాయ్‌లు వెళ్లే వరకు సామాన్యులకు పడిగాపులు తప్పవు. అయితే, ఇకపై ఢిల్లీలో సామాన్యులకు ఈ వీవీఐపీ వాహనాల వల్ల కలిగే ట్రాఫిక్ జామ్ తప్పనుంది. సామాన్య ప్రజల ట్రాఫిక్ ఇక్కట్లు తప్పించేందుకు ప్రధాని నివాసం నుంచి పార్లమెంటు వరకు సొరంగ మార్గం ఏర్పాటు చేయనున్నారు.
ఢిల్లీలోని రాజ్యాంగ సంస్థల భవనాలు - ప్రభుత్వ భవనాలను మార్చడానికి - కొత్త రూపురేఖలు కల్పించడానికి సెంట్రల్ విస్టా ప్రాజెక్టును చేపట్టారు. ఈ సెంట్రల్ విస్టాలో భాగంగా ప్రధాని నివాసం నుంచి పార్లమెంటు వరకు సొరంగ మార్గం ఏర్పాటు చేయనున్నామని ఈ ప్రాజెక్టు రూపకర్త బిమల్ పటేల్ వెల్లడించారు. కట్టుదిట్టమైన సెక్యూరిటీ అవసరమైన ప్రధాని వంటి వీవీఐపీలను సాధారణ ట్రాఫిక్ నుంచి వేరుచేయనున్నామని తెలిపారు. అందుకోసం ప్రధాని నివాసం నుంచి పార్లమెంటు వరకూ ఓ ప్రత్యేక టన్నెల్ రోడ్డును ఏర్పాటు చేస్తున్నామన్నారు. మరోవైపు, సెంట్రల్ విస్టా ప్రాజెక్టులో భాగంగా ప్రధాని నివాసాన్ని కూడా సౌత్ బ్లాక్ కు మారుస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.