Begin typing your search above and press return to search.

చైనాపై మోడీకి ఇరికించిన రాహుల్.. పీఎంవో రంగంలోకి..!

By:  Tupaki Desk   |   20 Jun 2020 5:30 PM GMT
చైనాపై మోడీకి ఇరికించిన రాహుల్.. పీఎంవో రంగంలోకి..!
X
భారత్-చైనా సరిహద్దుల్లో ఘర్షణ నేపథ్యంలో ప్రధాని నరేంద్రమోడీ అఖిలపక్షంలో మాట్లాడిన మాటలను అందిపుచ్చుకున్న రాహుల్ గాందీ ఆయన్ను ఇరికించేశాడు. దీంతో మోడీ దెబ్బకు దిగివచ్చిన తన ప్రధాన మంత్రి కార్యాలయం ద్వారా వివరణ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. రాహుల్ గాంధీ ప్రశ్నలకు ఏకంగా కేంద్రమే షేక్ అయిన పరిస్థితి కనిపించింది.

తాజాగా రాహుల్ గాంధీ సంచలన ఆరోపణలు చేశారు. చైనా దూకుడుకు లొంగిపోయి మోడీ భారత భూభాగాన్ని వదిలిపెట్టాడంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అసలు గాల్వన్ లోయలో ఏం జరిగిందో ప్రధాని మోడీ ఇప్పటికీ వివరంగా చెప్పలేకపోతున్నాడని.. ఒకవేళ చైనా మన భూభాగాన్ని ఆక్రమించకపోతే 20 మంది సైనికులు ఎలా చనిపోయారని.. అసలు వారు ఎక్కడ చంపబడ్డారో తెలుపాలని రాహుల్ గాంధీ తాజాగా మోడీని సూటిగా ప్రశ్నించారు. ఇక అఖిలపక్ష సమావేశంలో గాల్వన్ లోయలో ఘర్షణలపై కాంగ్రెస్ కూడా అనుమానం వ్యక్తం చేసింది. అక్కడ అసలు ఏం జరిగిందో బయటపెట్టాలని డిమాండ్ చేసింది.

దీంతో కేంద్రంలోని బీజేపీ సర్కార్ ఇరుకునపడింది. మోడీ చేసిన వ్యాఖ్యలకు కొందరు వక్రభాష్య చెపుబుతున్నారని.. చైనా గాల్వన్ లోయలోకి వాస్తవాధీన రేఖ అతిక్రమించి రావడంతో హింస జరిగింది ప్రధాన మంత్రి కార్యాలయం ద్వారా కేంద్రం స్పష్టం చేసింది. వాస్తవాధీన రేఖ వెంబడి చైనా నిర్మాణాలు చేపట్టేందుకు ప్రయత్నించిందని.. వాటిని తొలగించేందుకు నిరాకరించడంతోనే ఘర్షణ జరిగిందని పీఎంవో కార్యాలయం వివరణ ఇచ్చింది. భారత భూభాగంలోకి ఎవరూ చొరబడలేదని.. ఏ మిలటరీ పోస్టును ఆక్రమించలేదని స్పష్టం చేసింది.

మన సైనికులు దేశం కోసం పోరాడుతుంటే కాంగ్రెస్ నేతలు రాజకీయం చేయడం తగదని.. మన సైనికుల నైతిక స్థైర్యాన్ని దెబ్బతీస్తున్నారని బీజేపీ నేతలు సైతం కాంగ్రెస్ పై ఆడిపోసుకున్నారు.