Begin typing your search above and press return to search.
ఎలక్షన్ కమిషన్ తో ప్రవర్తనపై పీఎంవో కార్యాలయానికి విమర్శలు..
By: Tupaki Desk | 18 Dec 2021 6:23 AM GMTప్రధానమంత్రి కార్యాలయం వివాదంలో చిక్కుకుంది. స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన ఎన్నికల కమిషనర్ తో సహా ఇద్దరు ఎలక్షన్ అధికారులను ఇక్కడికి రావాల్సిందిగా ఆదేశించడపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. స్యయం ప్రతిపత్తి కలిగిన ఎన్నికల కమిషన్ ప్రభుత్వానికి అనుగుణంగా పనిచేయాల్సిన అవసరం లేదని, ప్రధాని కార్యాలయానికి వెళ్లాల్సిన అవసరం అంతకన్నా లేదని ప్రతిపక్ష నాయకులు విమర్శిస్తున్నారు. అయితే ఎలక్షన్ కమిషన్ కేవలం రాష్ట్రపతికి మాత్రమే సమాధానాలు చెప్పే విధంగా నడుచుకోవాలని అంటున్నారు.
అయితే ఎలక్షన్ కమిషన్లో ఉండే అధికారుల ప్రవర్తన వల్లే ప్రధాని కార్యాలయం ఈ విధంగా ఆహ్వానించిందని మరోవైపు విమర్శిస్తున్నారు. ఈ విషయంపై సోషల్ మీడియాను బేజ్ చేసుకొని రకరకాల విమర్శలు గుప్పిస్తున్నారు.
ఎన్నికల సంస్కరణలపై చర్చించేందుకు ప్రభుత్వం సమాయత్తమవుతోంది. ఈ నేపథ్యంలో ఎలక్షన్ కమిషన్తో ఈ విషయంపై చర్చించడానికి సంబంధిత అధికారులను ప్రధాని కార్యాలయానికి రావాల్సిందిగా కేంద్ర న్యాయ శాఖ మంత్రి లేఖ రాశారని అంటున్నారు. అయితే నవంబర్ 16నే ఈ సమావేశం జరిగిందని, ఆలస్యంగా బయటపడిందని అంటున్నారు. దీంతో ప్రధానికార్యాలయం చేసిన పనికి ప్రతిపక్షాలన్నీ మండిపడుతున్నాయి.
ఎలక్షన్ విషయంలో కమిషన్ సొంతంగా నిర్ణయాలు తీసుకునే హక్కు ఉంది. ప్రధాని కార్యాలయం చెప్పిన విధంగా నడుచుకోవాల్సిన అవసరం లేదు. ప్రధాని కార్యాలయం రావాలని పిలిచినా వెళ్లాల్సిన అవసరం లేదు. వెళ్లకున్నా పెద్దగా ఒరిగేదేమీ ఉండదు. అయితే కమిషన్లో ఉండే సభ్యలను భట్టి ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటారు.
ఎలక్షన్ కమిషన్ అధికారులు కాస్త గట్టిగా ఉంటే అన్ని పక్షాలతో సమానంగా ఉంటారు. ప్రధాని కార్యాలయం ఆదేశాలను పట్టించుకోరు. ఏదైనా సమాధానం చెప్పాలంటే లేఖ ద్వారా మాత్రమే చెప్పాల్సి ఉంటుంది. రాష్ట్రపతికి మాత్రమే జవాబుదారీతనంగా నడుచుకోవాలి. కానీ ఇప్పుడున్న అధికారులు ప్రధాని కార్యాలయం పిలిస్తే వెళ్లడంపై విమర్శలు వస్తున్నాయి.
ఏదైనా ముఖ్యమైన సమాశముంటే ప్రధానమంత్రి తరుపున ఉన్నతాధికారులు, ఎలక్షన్ కమిషన్ తరుపున అధికారులు ప్రత్యేకంగా సమావేశమవుతారు. కానీ ఎలక్షన్ నిర్వహించే నిర్ణయాలు మాత్రం కమిషన్ మాత్రమే తీసుకుంటుంది.
అయితే ప్రభుత్వ సౌలభ్యం,పరిస్థితులను భట్టి అనుగుణంగా ఎన్నికల తేదీలను నిర్ణయించే అధికారం ఉంటుంది. అంతేగానీ ప్రభుత్వం చెప్పిన విధంగా ఎన్నికల కమిషన్ నడుచుకోదు. కానీ కొందరు అధికారుల అలసత్వం వల్ల కమిషన్ పరువు తీస్తున్నారని అంటున్నారు.
గతంలో ఎలక్షన్ కమిషన్లో పనిచేసిన వారు ప్రధాని కార్యాలయాన్ని తప్పుబడుతున్నారు. మరోవైపు ఇప్పుడున్న ఎలక్షన్ కమిషన్ అధికారులను కూడా విమర్శిస్తున్నారు. ప్రభుత్వానికి అధికారులు లొంగిపోవడం వల్లే ఈ పరిస్థితి వచ్చిందని అంటున్నారు. అయితే ఎలక్షన్ కమిషన్ మాత్ర ఈ ఆరోపణలు కొట్టిపారేస్తుంది.
న్యాయశాఖతో సమావేశం సందర్భంగా తప్పలేదంటున్నారు. తాము ఎలక్షన్ కమిషన్ హోదాలోనే వెళ్లామని, ఏ పార్టీకి అనుగుణంగా పనిచేయలేదని అంటున్నారు. ఆరోపణలు ఇప్పటికైనా కట్టిపెడితే బాగుంటుందని అంటున్నారు.
అయితే ప్రతిపక్షాలు మాత్రం ప్రధాని కార్యాలయంపై మండిపడుతున్నారు. వారిని ఏదో విధంగా లొంగదీసుకునేందుకే ఇలంటి ఆహ్వానాలు పంపుతున్నారంటున్నారు. ఎలక్షన్ కమిషన్ స్వయం ప్రతిపత్తి హోదాలో పనిచేస్తుందన్న విషయం ప్రధాని కార్యాలయానికి తెలియదా..? అని విమర్శిస్తున్నారు. కొన్ని విషయాల్లో తప్పదని ఎలక్షన్ అధికారులు అంటున్నా.. ఆహ్వానం పలికిన సందర్భాల్లో ఇతర మార్గాలను ఆలోచించాల్సి ఉండేదని అంటున్నారు.
ఈ క్రమంలో ఎలక్షన్ కమిషన్ ను పీఎంవో నియంత్రిస్తూ తమకు అనుగుణంగా పనిచేసేలా ప్రవర్తిస్తోందని ధ్వజమెత్తుతున్నారు. పీఎంవో కార్యాయాలనికి ఎలక్షన్ కమిషన్ రిపోర్టుల రూపంలోమాత్రమే సమాధానం చెప్పాల్సి ఉంటుందని, ఇలా ప్రత్యేకంగా కార్యాలయానికి వెళ్లాల్సిన పనిలేదని అంటున్నారు. అయితే దీనిపై వివాదం రాజుకోవడంతో ఇరు పక్షాల మధ్య వాదనలు పెరిగిపోతున్నాయి.