Begin typing your search above and press return to search.

మాడభూషికి మోడీ ఆఫీసు నుంచి చీవాట్లు

By:  Tupaki Desk   |   4 May 2016 8:30 AM GMT
మాడభూషికి మోడీ ఆఫీసు నుంచి చీవాట్లు
X
కేంద్ర సమాచార కమిషనర్ గా పనిచేస్తున్న తెలుగు వ్యక్తి మాడభూషి శ్రీధర్ పై ప్రధాన మంత్రి కార్యాలయం తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసినట్లుగా తెలుస్తోంది. ప్రధాని విద్యార్హతలు, డిగ్రీలకు సంబంధించిన వివరాలను కోరుతూ ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ లేఖరాయగా దాన్ని ఆర్టీఐ దరఖాస్తు గా పరిగణించి పరిధులు దాటారని పీఎంఓ అన్నట్లు తెలుస్తోంది.

కేజ్రీవాల్ కోరిన సమాచారం ఇవ్వాలంటూ పీఎంఓను మాఢభూషి ఆదేశించినా ఆ ఆదేశాలు చెల్లవని అంటోంది. ముఖ్యమంత్రి కోరినంత మాత్రాన అది పట్టుకుని పీఎంఓకు ఎలా ఆదేశాలు జారీ చేస్తారని అక్కడి అధికారులు అంటున్నారట. అంతేకాకుండా.. ప్రధాని డిగ్రీల వివరాల కోసం గుజరాత్ వర్సిటీని కూడా మాడభూషి ఆదేశించారని... అది గుజరాత్ ఆర్టీఐ చట్టం పరిధిలోకి వస్తుందే కానీ, కేంద్ర చట్టం పరిధిలోకి రాదని అంటున్నారు.

ఈ నేపథ్యంలో మాఢభూషి తన పరిధులు దాటారని పీఎంఓ వర్గాలు ఆయన దృష్టికి తెచ్చాయని.. అసంతృప్తి - ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయని తెలుస్తోంది. కేజ్రీవాల్ దరఖాస్తు చేయలేదని, కేవలం లేఖ మాత్రమే రాశారని చెబుతున్నారు. ఈ వివాదం ఎలాంటి మలుపు తిరుగుతుందో చూడాలి.