Begin typing your search above and press return to search.
సర్ ప్రైజ్..మన పోచారం ఈ పనిచేస్తారా?
By: Tupaki Desk | 7 Sep 2019 2:30 PM GMTప్రతి ఇంట్లో రాత్రి అయ్యిందంటే చాలు కర్ఫ్యూ వాతావరణమే నెలకొంటుంది. ఈ ఆడవాళ్ల రాజ్యంలో రాత్రి అయ్యిందంటే చాలు మగాళ్లకు టీవీ రిమోట్ దక్కడం కష్టమే.. ఈటీవీ, జెమనీ, మాటీవీల్లో పాపులర్ చానెల్స్ ను చూస్తూ అందులో తమని తాము ఊహించుకుంటూ మహిళలు సీరియళ్లపై పెంచుకునే ప్రేమ అంతా ఇంతాకాదు..
మరి మహిళల సంగతి సరే.. ప్రభుత్వంలో ఉండే ప్రజాప్రతినిధులు.. అదీ బీజీగా ఉండే స్పీకర్ లాంటి వాళ్లు కూడా ఈ సీరియళ్లు చూస్తారా? అంటే చూస్తారనే చెప్పక తప్పదు.
మంత్రులు, ఎమ్మెల్యేలు, స్పీకర్ లాంటి వాళ్లకు టైం ఉంటుందా అని బిగుసుకుపోకండి.. ఉంటుంది. వాళ్లు కళాపోషకులే అన్న విషయం తాజాగా తెలిసింది. తెలంగాణ శాసనసభా స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి తాజాగా తన హాబీని బయటపెట్టారు. అది ఇప్పుడు చర్చనీయాంశమైంది.
తాజాగా తెలంగాణ రాష్ట్ర భాష సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో రవీంధ్రభారతిలో శనివారం సినిమా, సీరియల్ ఆర్టిస్ట్ యూనియన్ సభ్యులకు పురస్కారాల ప్రధానం జరిగింది. దీనికి తెలంగాణ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై కళాకారులను సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన హాట్ కామెంట్ చేశారు. తాను ప్రతీ రాత్రి సీరియళ్లు చూస్తూ ఎంజాయ్ చేస్తానని.. రాజకీయ నాయకులు ఒత్తిడి తగ్గించుకోవడానికి సీరియళ్లు - సాంస్కృతిక కార్యక్రమాలు చూస్తే ప్రెషర్ తగ్గుతుందని సలహా ఇచ్చారు. దీన్ని బట్టి మన స్పీకర్ పోచారం సారూ తెలుగు సీరియళ్ల అభిమానియే అని తేలింది..