Begin typing your search above and press return to search.
సిండికేటు బ్యాంకుకు తెలంగాణ మంత్రి ‘వార్నింగ్’
By: Tupaki Desk | 25 Nov 2016 5:47 AM GMTనోట్ల రద్దు నేపథ్యంలో బ్యాంకులు వ్యవహరిస్తున్న తీరుపై ప్రజాప్రతినిధులు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ఇక.. ప్రభుత్వాధినేతల సంగతి చెప్పనక్కర్లేదు. నోట్ల కొరత కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురి అవుతున్నారని మండిపడుతున్నారు. ఇదంతా ఒక ఎత్తు అయితే.. రైతులకు రుణాలు ఇవ్వకుండా బ్యాంకులు ముప్పతిప్పలు పెడుతున్నాయని ఫైర్ అవుతున్నారు. బ్యాంకులు రుణాలు ఇవ్వకుండా రైతల్ని కాల్చుకుతింటున్నాయంటూ తెలంగాణ రాష్ట్ర మంత్రి పోచారం శ్రీనివాస రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమావేశం వాడీ వేడీగా సాగింది.
నోట్ల రద్దు.. రైతులకు రుణాలకు సంబంధించిన అంశాలపై బ్యాంకర్లు వ్యవహరిస్తున్న తీరుపై తెలంగాణ రాష్ట్ర మంత్రులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ ఏడాది ఖరీప్ లో 36.52 లక్షల మంది రైతులకు రుణాలు ఇవ్వాల్సి ఉంటే.. బ్యాంకులు కేవలం 22.5 లక్షల మందికి మాత్రమే రుణాలు ఇచ్చినట్లుగా చెప్పిన పోచారం.. లక్ష రూపాయిల మేర రుణాలు తీసుకునే రైతుల నుంచి ఎలాంటి వడ్డీ వసూలు చేయొద్దని ప్రభుత్వం చెబుతున్నా బ్యాంకులు మాత్రం మాట వినటం లేదని.. రైతుల నుంచి వడ్డీ వసూలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
మిగిలిన బ్యాంకులతో పోలిస్తే ఆంధ్రా బ్యాంకు రైతులకు మెరుగ్గా రుణాలు ఇచ్చిందని.. సిండికేటు బ్యాంకు మాత్రం దారుణంగా వ్యవహరించిందని మండిపడ్డారు. ఈ సందర్భంగా సిండికేటు బ్యాంకుపై మంత్రి హెచ్చరిక తరహాలో వ్యాఖ్యలు చేయటం సంచలనంగా మారింది. ‘‘సిండికేట్ బ్యాంకు వారు తెలంగాణలో ఉన్నామనుకుంటున్నారా? మరెక్కడో ఉన్నామనుకుంటున్నారా?’’ అని నిలదీసిన ఆయన.. బ్యాంకుల వ్యవహరిస్తున్న తీరుతో చాలామంది రైతులు ప్రైవేటు వ్యాపారస్తుల్ని.. వడ్డీ వ్యాపారస్తుల్ని ఆశ్రయిస్తున్నట్లుగా చెప్పారు. రుణమాఫీ వాయిదాలో భాగంగా రూ.2020 కోట్లు బ్యాంకులకు ఇచ్చినా.. ఇప్పటికి కొన్ని బ్యాంకులు ఆ మొత్తాన్ని రైతుల ఖాతాల్లో ఎందుకు వేయలేదని ప్రశ్నించారు. మొత్తంగా బ్యాంకర్లతో తెలంగాణ మంత్రులు నిర్వహించిన భేటీ హాట్ హాట్ గా సాగింది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/