Begin typing your search above and press return to search.

బాన్సువాడలో బస్తీమే సవాల్..తనయులు నిలిబెడతారా?పడగొడతారా?

By:  Tupaki Desk   |   20 Jan 2020 12:44 PM GMT
బాన్సువాడలో బస్తీమే సవాల్..తనయులు నిలిబెడతారా?పడగొడతారా?
X
తెలంగాణ లో ప్రస్తుతం మున్సిపల్ ఎన్నికల పోరు నడుస్తుంది. ఈ మున్సిపల్ ఎన్నికలు తెలంగాణ లోని ఒక సీనియర్ - కీలక నేత కుటుంబానికి అగ్ని పరీక్షలా తయారైయ్యాయి. దీనితో తన ఇద్దరు కుమారులని రంగంలోకి దించేశారు. ఇంతకీ ఆ కీలక నేత ఎవరు అని అనుకుంటున్నారా స్పీకర్ పోచారం. బాన్సువాడ బస్తీ పోరు - ఆ సీనియర్ నేత గుండెల్లో గుబులు రేపడానికి కారణం ఏంటి? కామారెడ్డి జిల్లాలో ఇంతకు ముందు కేవలం కామారెడ్డి మున్సిపాలిటి మాత్రమే ఉండేది. తాజాగా ఎల్లారెడ్డి - బాన్సువాడ మున్సిపాలిటిలు ఏర్పాటయ్యాయి. ప్రస్తుతం కొత్తగా ఏర్పాటైన బాన్సువాడలో టీఆర్ ఎస్ - కాంగ్రెస్ ల మధ్య టఫ్ ఫైట్ నడుస్తోంది. మున్సిపాలిటీ ఎన్నికలకు ముందే బాన్సువాడలో ఓ వార్డును ఏకగ్రీవం చేసి అధికార టిఆర్ ఎస్ పార్టీ బోణి కొట్టింది. కానీ , అక్కడ మాత్రం చెర్మైన్ పదవి తక్కించుకోవడం అనుకున్నంత సులువు కాదు అని తెలుస్తోంది.

పట్టణంలో మొత్తం 19వార్డులు ఉండగా 20వేల మంది ఓటర్లు ఉన్నారు. బీసీ - ఎస్సీ - ఎస్టీ - మైనార్టీ ఓటర్లు ఎక్కువగా ఉండే పట్టణంలో ఆ ఓటర్లు ఏ పార్టీకి ఎక్కువగా మొగ్గు చూపుతారో ఆ పార్టీ విజయం సాధిస్తుంది. రెండు సామాజికవర్గాలు ఎటు వైపు మొగ్గు చూపితే వారికే గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కొత్తగా ఏర్పడిన తర్వాత తొలిసారి బాన్సువాడ మున్సిపాలిటి ఎన్నిక జరుగుతువుండటంతో రెండు ప్రధాన పార్టీలు గెలుపే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నాయి. దీనితో టిఆర్ ఎస్ నుంచి పోచారం కుటుంబానికి చైర్మన్ పీఠంను దక్కించుకోవడం ప్రతిష్టత్మకంగా మారింది.

ఎలాగైనా బాన్సువాడ మున్సిపాలిటిపై గులాబి జెండా ఎగురవేయాలన్న లక్ష్యంతో స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి వ్యూహారచన చేస్తున్నారు. ఇక్కడ పార్టీ గెలుపు స్పీకర్‌ కు ఎంతో కీలకమనే చెప్పాలి ఏ మాత్రం తేడా వచ్చిన రాజకీయంగా వారి కుటుంబానికి పెద్ద దెబ్బ తగిలినట్టే అని చెప్పాలి. దీనితో ఈ ఎన్నికను పోచారం చాలా సీరియస్‌ గా తీసుకోని - తన ఇద్దరు కొడుకులు భాస్కర్ రెడ్డి - సురేందర్ రెడ్డిలను కూడా రంగంలోకి దింపి చైర్మన్ పీఠమే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తున్నారు. బాన్సువాడ పట్టణంలో కాంగ్రెస్ పార్టీ సైతం బలంగా ఉంది. అసెంబ్లీ ఎన్నికల్లో బాన్సువాడ పట్టణంలో కాంగ్రెస్ అభ్యర్థి కాసుల బాలరాజుకు మోజార్టీ వచ్చింది పోచారంపై కాసుల బలరాజు ఓడిన బాన్సువాడ టౌన్‌ లో, కాంగ్రెస్‌ కు లీడ్ రావడం టిఆర్ ఎస్ ను కలవరానికి గురిచేస్తోంది. అయితే మళ్లీ వెంటనే జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో టిఆర్ ఎస్ కు లీడ్ తీసుకొచ్చినా బాన్సువాడ పట్టణ ఓటర్ల నాడి ఎలా ఉంటుందో తెలియక టెంక్షన్ పడుతున్నారు. రాజకీయంగా ఈఎన్నిక కీలకంగా మారడంతో అభ్యర్థుల ఎంపిక నుండి ప్రచార బాధ్యతలని సైతం ఈ ఇద్దరు అన్ని తామై వ్యవహారిస్తున్నారు. అలాగే బాన్సువాడ తొలి పీఠంపై గులాబీ జెండా ఎగురవేస్తామనే ధీమా వ్యక్తం చేస్తున్నారు. అలాగే కాంగ్రెస్ సైతం బాన్సువాడపై గట్టిగానే ఫోకస్ పెట్టింది. చూడాలి మరి బాన్సువాడ మున్సిపాలిటీని గెలిచి తనయులు తండ్రి ఆధిపత్యాన్ని నిలబెడతారో ... పడగొడతారో ...