Begin typing your search above and press return to search.

రిటైర్ మెంటే.. పోచారం పదవికి కారణమా?

By:  Tupaki Desk   |   18 Jan 2019 5:35 AM GMT
రిటైర్ మెంటే.. పోచారం పదవికి కారణమా?
X
తెలంగాణ రెండో శాసనసభ కొలువుదీరింది. ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేశారు. కానీ తెలంగాణ రెండో శాసనసభ స్పీకర్ పదవి ఇస్తామంటే ఏ సీనియర్ టీఆర్ఎస్ లో తీసుకోని పరిస్థితి. మాజీ మంత్రి ఈటల రాజేందర్ ను తీసుకోమని కేసీఆర్ ఎంత ఒత్తిడి తెచ్చినా ఈటల అలిగి వెళ్లిపోయాడు. దీంతో చేసేదేం లేక కేసీఆర్ మరో సీనియర్ అయిన పోచారం శ్రీనివాసరెడ్డిని ఇంటికి పిలిపించి బుజ్జగించి మరీ అప్పగించాడు. కానీ దీనివెనుక పెద్ద కథే ఉంది.

పోచారం శ్రీనివాసరెడ్డికి వయసు 70 ఏళ్లు దాటింది. ఆయన వయోభారంతో బాధపడుతున్నాడు. అందుకే ఈసారి తన కుమారుడిని బాన్సువాడలో నిలబెట్టి గెలిపించుకుందామని అనుకున్నాడు. కానీ తెలంగాణలో రెండోసారి గెలిస్తే తనకు మంత్రి పదవి కానీ ఏదైనా పెద్ద పదవి వస్తుందని భావించి వయోభారం లెక్కచేయకుండా పోటీచేసి గెలిచారు. సీఎం కేసీఆర్ ను కూడా తన కుమారుడి రాజకీయ భవిష్యత్ కోసం తాను వైదొలుగుతానని.. తాను రైటర్ మెంట్ తీసుకుంటానని ఎన్నికల ముందు విన్నవించాడట.. కానీ కేసీఆర్ అభ్యంతరం చెప్పడంతో పోటీచేశాడు. వచ్చేసారి మాత్రం తాను పోటీచేయనని.. కుమారుడికి టికెట్ ఇవ్వాలని కేసీఆర్ వద్ద ప్రస్తావించాడని తెలిసింది. కుమారుడిని ఈ ఐదేళ్లు నియోజకవర్గంలో నాయకుడిగా రాటుదేల్చాలని కేసీఆర్ సలహా ఇచ్చినట్లు సమాచారం.

వచ్చేసారి ఎలాగూ పోటీచేయకుండా రిటైర్ మెంట్ తీసుకుంటానని చెప్పడంతో కేసీఆర్ పోచారంను స్పీకర్ చేసేందుకు ఒప్పించినట్టు తెలిసింది. స్పీకర్ గా చేసిన వారు వచ్చే ఎన్నికల్లో ఓడిపోయి రాజకీయ భవిష్యత్ ఉండదనే సెంటిమెంట్ తెలుగునాట కొనసాగుతుండడంతో ఎవ్వరూ చేపట్టడానికి ముందుకు రావడంలేదు. పోచారం కూడా భయపడ్డాడు. కానీ వచ్చేసారి పోచారం పోటీకి దూరంగా జరగడంతో ఇక ఆయన్నే స్పీకర్ గా కన్ఫం చేశారట కేసీఆర్.