Begin typing your search above and press return to search.

అమెజాన్‌లో అమ్మ‌కానికి విషం .. కేసు నమోదు !

By:  Tupaki Desk   |   26 Nov 2021 5:30 AM GMT
అమెజాన్‌లో అమ్మ‌కానికి విషం .. కేసు నమోదు !
X
ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజ సంస్థ అమెజాన్ ఇటీవల తరచూ వివాదాలకు కేంద్ర బిందువుగా మారుతోంది. ఇటీవల అమెజాన్ వేదికగా గంజాయి అమ్మకాలు జోరుగా కొనసాగుతుండటంతో పలు విమర్శలు వస్తున్నాయి. ఇప్పుడు అమెజాన్‌ పై మరో వివాదం వచ్చింది. దీనితో అమెజాన్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. అమెజాన్‌ పై మ‌రో కేసు న‌మోదైంది. ఆన్‌ లైన్‌ లో విషం అమ్ముతోందంటూ ఎఫ్ ఐ ఆర్ న‌మోదు చేయాల‌ని మ‌ధ్య‌ప్ర‌దేశ్ హోంమంత్రి న‌రోత్త‌మ్ మిశ్రా పోలీసుల‌ను ఆదేశించారు. అనారోగ్యంతో బాధ‌ప‌డుతున్న‌ఇండోర్‌ లో 18ఏళ్ల బాలుడు అమెజాన్ ద్వారా విషం కొనుగోలు చేసి, దాన్ని సేవించి ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడు.

ఈ ఘ‌ట‌న‌ను తీవ్రంగా ప‌రిగ‌ణించిన మ‌ధ్య‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం సంబంధిత ఈ -కామ‌ర్స్ సంస్థ‌ అమెజాన్‌పై చ‌ట్ట‌ప‌రంగా చ‌ర్య‌ల‌కు శ్రీ‌కారం చుట్టింది. బాలుడి త‌ల్లిదండ్రులు ప‌లుమార్లు పోలీసుల‌కు ఫిర్యాదు చేసినా ఎఫ్ ఐ ఆర్ న‌మోదు చేయ‌లేదు. తాజాగా ఈ విష‌యాన్ని త‌న దృష్టికి తీసుకొచ్చార‌ని హోంమంత్రి మిశ్రా తెలిపారు. ఈ నేప‌థ్యంలో సంబంధిత అమెజాన్ నిర్వాహ‌కుడిపై ఎఫ్ ఐ ఆర్ న‌మోదు చేసి, అరెస్టు చేయాలని ఆదేశించిన‌ట్లు న‌రోత్త‌మ్ మిశ్రా గురువారం ఇండోర్‌ లో మీడియా స‌మావేశంలో వెల్ల‌డించారు. అంత‌కు ముందు న‌వంబ‌ర్ 16న భింద్ జిల్లా పోలీసులు ఆన్‌ లైన్‌ లో గంజాయిను విక్ర‌యిస్తున్న‌ట్లు కేసు న‌మోదైంది. ఈ కేసులో ఇద్ద‌రు నిందితుల‌ను అరెస్టు చేసిన విష‌యం తెలిసిందే.