Begin typing your search above and press return to search.

పోల‌వ‌రం కాంట్రాక్ట‌ర్ కిడ్నాప్‌...

By:  Tupaki Desk   |   29 Jan 2017 10:20 AM GMT
పోల‌వ‌రం కాంట్రాక్ట‌ర్ కిడ్నాప్‌...
X
పశ్చిమగోదావరి జిల్లా పోలవరం ప్రాజెక్టు నిర్మాణం ప‌నుల విష‌యంలో ఉద్రిక‌త్త‌లు మొద‌లవుతున్నాయి. ప్రాజెక్టు ప‌నుల్లో సబ్ కాంట్రాక్టరుగా చేస్తున్న వ్యక్తి కిడ్నాప్‌ కు గురైనట్టు పోలవరం తెలిపారు. పోలవరం ప్రాజెక్టులో స్పిల్ వే ఛానల్ మట్టి పనులను త్రివేణి కాంట్రాక్టు ఏజెన్సీ నిర్వహిస్తోంది. వారి వద్ద సబ్‌ కాంట్రాక్టు తీసుకున్న గ్రాండ్ ఇంజనీరింగ్ లాజిస్టిక్ కంపెనీలో కేరళ రాష్ట్రం త్రివేండ్రానికి చెందిన బి రాజమేని అనే వ్యక్తి డైరెక్టరుగా పనిచేస్తున్నారు. ఆయన శుక్రవారం నుంచీ కనిపించడం లేదంటూ వారి వద్ద పనిచేస్తున్న సూపర్‌ వైజర్ షేక్ మీరాసాహెబ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కారులో డైరెక్టర్ రాజమేనిని గుర్తు తెలియని వ్యక్తులు తీసుకెళ్లారని సూపర్‌ వైజర్ ఆ ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఈ విషయంపై ఎస్‌ ఐ మాట్లాడుతూ కిడ్నాప్‌ నకు గురైన వ్యక్తి నెల్లూరు జిల్లా సూళ్లూరుపేటలో ఉన్నట్టు తెలిసిందని, సిబ్బందిని ఆ జిల్లాకు పంపి దర్యాప్తు సాగిస్తున్నట్టు తెలిపారు.

ఇదిలాఉండ‌గా... బందరు పోర్టు భూముల సమీకరణకు ఆక్వా రైతులు సహకరించాలని రాష్ట్ర బీసీ సంక్షేమం - చేనేత - ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర కోరారు. ఆక్వా రైతులతో సమావేశం నిర్వహించి పోర్టు అభివృద్ధికి మడ ద్వారా చేపట్టిన భూసమీకరణ ప్యాకేజీపై ఆక్వా రైతులకు మంత్రి రవీంద్ర అవగాహన కల్పించారు. ఈ సంద‌ర్భంగా ఆక్వా రైతులు తమ సమస్యలను మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. చేపలు - రొయ్యల సాగుకు అధికంగా పెట్టుబడులు పెట్టామని - చెరువులు తవ్వడం - గట్లు వేయడం - షెడ్ల నిర్మాణం - మోటార్ల ఏర్పాటుకు అధిక ఖర్చు చేసినట్లు తెలిపారు. దీన్ని పరిగణలోకి తీసుకుని తమకు మెరుగైన ప్యాకేజీ ఇప్పించాలని పలువురు రైతులు మంత్రిని కోరారు. ఈ సందర్భంగా మంత్రి రవీంద్ర మాట్లాడుతూ ఇప్పటికే ప్రభుత్వం మెరుగైన ప్యాకేజీని ప్రకటించిందన్నారు. మరింత ప్యాకేజీకై ప్రభుత్వంతో మాట్లాడుతున్నట్లు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం చెనై-విశాఖ కారిడార్ అభివృద్ధిలో మచిలీపట్నంను చేర్చినట్లు తెలిపారు. ఫలితంగా ఈ ప్రాంతంలో కేంద్రం మూడు వేల కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టే అవకాశం ఉందన్నారు

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/