Begin typing your search above and press return to search.
ముమ్మరంగా పనులు.. సకాలంలో పోలవరం పూర్తి
By: Tupaki Desk | 20 March 2020 9:30 AM GMTపోలవరం పనులను పూర్తిస్థాయి ఇంజనీరింగ్ - శాస్త్రసాంకేతిక పద్ధతుల్లో పూర్తి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం నడుం బిగించడం తో ఆ మేరకు కాంట్రాక్ట్ పొందిన సంస్థ మెగా కంపెనీ పనులను ముమ్మరం చేసింది. రాజకీయ - కాంట్రాక్టర్ల ప్రయోజనాలు పక్కనపెట్టి గత ప్రభుత్వ హయాంలో జరిగిన లోపాలు - లోటుపాట్లు, -ముఖ్యంగా అశాస్త్రీయంగా (నాన్-ఇంజనీరింగ్) పద్ధతిలో చేపట్టిన పనులన్నింటినీ క్రమంగా సవరిస్తూ ఇంజనీరింగ్ మోడల్లోనే పోలవరం ముందుకు సాగుతోంది. నిర్మాణ పరంగా - ఇంజనీరింగ్ అనుమతుల్లో ప్రాజెక్ట్ వేగం అందుకుంది. బహుళ ప్రయోజనాలు తీర్చే విధంగా సకాలంలో పనులు పూర్తిచేసేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోంది. నిర్ణీత గడువుకన్నా ముందే ప్రాజెక్ట్ ను పూర్తి చేయడానికి మేఘా పనులు ముమ్మరం చేస్తోంది.
ప్రాజెక్ట్ పూర్తికి ఇది అనువైన సమయం అని గుర్తించి మేఘా ఇంజనీరింగ్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్ (మేఘా) పూర్తిస్థాయిలో తన శక్తియుక్తులను కూడగట్టి ఈ ప్రాజెక్ట్ పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టింది. అనతికాలంలోనే ప్రాజెక్ట్ లోని స్పిల్ వేకు సంబంధించి 62,818 ఘనపు మీటర్ల పనిని చేయడంతో పాటు మిగిలిన పనులు యుద్ధ ప్రతిపాదికన చేపట్టేందుకు ప్రాథమిక కసరత్తులను మేఘా సంస్థ వేగవంతం చేసింది. గోదావరి నడిఒడ్డున మట్టి పటిష్టతకు సంబంధించి పటుత్వ (VIBRO COMPACTION WORKS UNDER PROGRESS) పరీక్షలు - గ్యాప్-1లో నిర్మాణానికి సంబంధించిన ప్రాథమిక పనులు, -జలవిద్యుత్ కేంద్రం నిర్మాణానికి సంబంధించిన కొండ తవ్వకం (బ్లాస్టింగ్) - ఎగువ - దిగువ కాఫర్ డ్యామ్ అవసరం మేరకు అంటే వరద ఉదృతి వల్ల ప్రాజెక్ట్ పనులకు అవరోధం ఎదురుకాని విధంగా చేపట్టే పనులు ముమ్మరమయ్యాయి.
ప్రాజెక్ట్ నిర్మాణంలో శాస్త్రీయమైన పద్ధతిలో డిజైన్ల అనుమతుల కోసం ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డితో కలిసి ఈ సంస్థ చర్యలు చేపట్టింది. ఈ మేరకు సీఎం జగన్ డిజైన్ల అనుమతులు సాధించేందుకు ఢిల్లీలోనూ - హైదరాబాద్ లోనూ ఇద్దరు ప్రత్యేక అధికారులను నియమిస్తూ ఆదేశాలు జారీ చేశారు. ఈమేరకు శాస్త్రీయ పద్ధతిలో పనులు ఊపందుకున్నాయి. ప్రాజెక్ట్ నిర్మాణాన్ని పూర్తిగా సంక్లిష్టం చేసి కొద్దిపాటి వరదలకే ప్రాజెక్ట్ లోకి నీరు చేరడమే కాకుండా గ్రామాలు మునిగిపోయే పరిస్థితిని చక్కదిద్దేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది.
మేఘా సంస్థ నవంబర్ లో ప్రాజెక్ట్ పనులు చేపట్టింది. ప్రాజెక్ట్ లో కాపర్ డ్యామ్ నిర్మాణానికి ప్రాధాన్యత ఇచ్చారు. అప్పట్లో 42.5 మీటర్ల ఎత్తులో కాపర్ డ్యామ్ నిర్మణానికి అంగీకరించడం నష్టం చేకూర్చింది. కాపర్ డ్యామ్ అనేది ప్రధాన జలాశయంలో నిర్మాణం జరిగేప్పుడు నీరు అడ్డు రాకుండా నదీ ప్రవాహాన్ని మళ్లించేందుకు ఏర్పాటు చేసే తాత్కాలిక నిర్మాణం. దీనివల్ల గతేడాది వరదలప్పుడు జలాశయంలో నీరు నిలిచిపోయి పనులు ఆగిపోవడమే కాకుండా నిర్మాణం ప్రాంతంలో నిర్మించిన రహదారులు కొట్టుకుపోయాయి. కనీసం 4 టిఎంసీల నీరు నిలువ ఉండడంతో దానిని తోడితే తప్ప పనులు చేయడం సాధ్యం కాని పరిస్థితుల్లో దాదాపు 3 నెలల పాటు పంపింగ్ మిషన్లు ఏర్పాటు చేసి ఆ నీటిని తరలించారు. ఈ ప్రాజెక్ట్ లో ఎర్త్ కమ్ ర్యాక్ ఫిల్ డ్యామ్ (ప్రధాన ఆనకట్ట)తో పాటు అందులోని మూడు గ్యాప్లు - స్పిల్ వే - స్పిల్ చానెల్, -అప్రోచ్ చానెల్ - పైలెట్ చానెల్ - కుడి-ఎడమ కాలువల అనుససంధానంతో పాటు జల విద్యుత్ కేంద్రం కీలకమైనవి. వీటి నిర్మాణానికి ప్రస్తుతం వేగంగా అడుగులు పడుతున్నాయి.
జనవరిలో 20,631 ఘనపు మీటర్లు - ఫిబ్రవరిలో 32,124 ఘ.మీ - మార్చిలో ఇప్పటివరకు 10,063 ఘ.మీ పనిని మేఘా పూర్తి చేయడం విశేషం. జనవరి నుంచి స్పిల్ వే పనులు ముమ్మరం చేసిన మేఘా ఇంజనీరింగ్ లక్ష్యానికి అనుగుణంగా పనులు సాగిస్తోంది. ప్రాజెక్ట్ నిర్మాణంలో స్పిల్ వే బీమ్ ల నిర్మాణంతో పాటు బ్రిడ్జ్ లు - డివైడ్ వాల్ - ట్రైనింగ్ వాల్ - గైడ్వాల్ పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి. ఎర్త్ కమ్ ర్యాక్ ఫిల్ డ్యామ్ - అందులోని మూడు గ్యాపులు - జల విద్యుత్ కేంద్రం మొదలైన ప్రధానమైన పనులు శరవేగంగా సాగుతున్నాయి.
జగన్ ప్రభుత్వం వచ్చాక నిర్మాణ సంస్థను మార్చి పనులు వేగమయ్యాయి. మొత్తం ప్రాజెక్ట్ కు 45 డిడిజైన్ లకు అనుమతులు లభించాలి. వాటిలో 37 డిజైన్లు అనుమతి సాధించడానికి దాదాపు పదేళ్ల సమయం పట్టింది. మరో ఎనిమిది కీలకమైన డిజైన్ల అనుమతి ప్రాజెక్ట్ లో కీలకమైనవి. ముఖ్యమంత్రి జగన్ ఆదేశాల మేరకు కేంద్ర జల సంఘం ఆధీనంలోని ప్రాజెక్ట్ అథారిటీ కమిటి పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించింది.
మార్చి 8వ తేదీన హైదరాబాద్ లో ప్రాజెక్ట్ డిజైన్ల కమిటీ సమావేశమై విస్తృతంగా చర్చించడం ద్వారా పెండింగ్ లో ఉన్న 8 డిజైన్లకు సంబంధించి దాదాపుగా ఓ నిర్ణయం వచ్చిందని సమాచారం. ఆనకట్ట (ఎర్త్ కమ్ ర్యాక్ ఫిల్ డ్యామ్) మూడో గ్యాపులో కాంక్రీట్ నిర్మాణం చేపడితేనే ప్రాజెక్ట్ వరదల సమయంలో పటిష్టంగా ఉంటుందని ఆ కమిటీ తేల్చిచెప్పింది.
ఇంజనీరింగ్ నిపుణులకు ఈ విధమైన స్వేచ్ఛ ఇవ్వడం ద్వారా పనులు ముమ్మరమయ్యాయని మెఘా సంస్థ ప్రతినిధులు చెబుతున్నారు. ప్రాజెక్ట్ డిజైన్ల ఆమోద ప్రక్రియను వేగవంతం చేయాలని సీడబ్ల్యూసీ చైర్మన్ ఏ.డి.పాండ్య అధ్యక్షతన ఏర్పాటైన కమిటీపై ప్రభుత్వం ఒత్తిడి తేవడంతో పెండింగ్ ఉండిపోయిన అప్రోచ్ ఛానెల్ ఎడమగట్టుపై ర్యాక్ ఫిల్ గైడ్వాల్ నిర్మాణం - స్పిల్ వే నుంచి విడుదలయ్యే వరద ఉధృతిని తట్టుకునే విధంగా ఎడమ గట్టువైపు పటిష్టమైన నిర్మాణానికి సంబంధించిన డిజైన్ రూపొందించాలని నిర్ణయించింది. స్పిల్ వే నుంచి విడుదలయ్యే వరద నీరు కుడిగట్టుపై పడుతుంది. దీనికి కూడా పటిష్టమైన డిజైన్ను రూపొందించేందుకు కమిటీని ఏర్పాటు చేసింది. స్పిల్ ఛానెల్ నుంచి వరద నీరు పైలెట్ ఛానెల్ మీదుగా గోదావరి నదిలోకి కలిసే పనులకు సంబంధించి డిజైన్ ను కేంద్ర జల సంఘానికి ప్రాజెక్ట్ అధికారులు సమర్పించారు. దీనికి త్వరితగతిన అనుమతి సాధించేందుకు ప్రభుత్వం రంగంలోకి దిగింది.
ప్రధాన ఆనకట్టలోని గ్యాప్-1లో నిర్మించే మట్టి, రాతి నిర్మాణ పనులకు ఇంకా అనుమతి లభించలేదు. ప్రాజెక్ట్ లో ఇది ఎంత ముఖ్యమైనదో అందరికీ తెలుసు. గ్యాప్-2లో ఏ విధమైన నిర్మాణం ఉండాలనే దానిపైన కూడా చర్చించి ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ఈ విధంగా అనేక పనులకు సంబంధించి ఇప్పుడే ఇంజనీరింగ్ తరహాలో పనులు ముమ్మరం అయ్యాయి. మొత్తానికి ఇక పోలవరం ప్రాజెక్ట్ సకాలంలో పూర్తి అవుతుందనే నమ్మకం ఇప్పుడు కలుగుతోంది. దీంతో సకాలంలో పోలవరం పూర్తికి పనులు ముమ్మరంగా సాగుతుండడం ఆహ్వానించదగ్గ విషయం.