Begin typing your search above and press return to search.

సాధించిన జగన్.. పోలవరానికి కేంద్రం రూ.1850 కోట్లు..

By:  Tupaki Desk   |   11 Jan 2020 10:21 AM GMT
సాధించిన జగన్.. పోలవరానికి కేంద్రం రూ.1850 కోట్లు..
X
గత ప్రభుత్వం లో చంద్రబాబు పోలవరాన్ని ఓ బంగారు గుడ్డు పెట్టే బాతుగానే భావించారు. అందుకే దాన్ని బేస్ చేసుకొని తన అనుయాయులైన కాంట్రాక్టర్ల తో వేల కోట్లను విడుదల చేసుకొని దాన్ని పూర్తి చేయకుండా ఏపీ కలకల ప్రాజెక్టును అలాగే వదిలేశారన్న విమర్శలు వెల్లువెత్తాయి. జాతీయ ప్రాజెక్టుగా కేంద్రం ప్రకటించి నిధులు ఇస్తామన్నా ఆడిటింగ్ స్టేట్ మెంట్స్ పంపించకుండా తన నిధుల బొక్కాలు బయటపడకుండా ఆ ప్రాజెక్టును గాలికి వదిలేసి ఏపీకి అన్యాయం చేశారని వైసీపీ అప్పట్లో ఆరోపించింది.

అయితే సీఎం జగన్ అధికారంలోకి వచ్చాక ఏపీ కలల ప్రాజెక్టు పోలవరాన్ని చేపట్టింది. మేఘా సంస్థకు రివర్స్ టెండరింగ్ తో అప్పగించి పనులు వేగంగా పూర్తి చేయడానికి నడుం బిగించింది. పోలవరం కు పెట్టిన ఖర్చుపై ప్రతీ పైసా ఆడిటింగ్ చేసి కేంద్రానికి సమర్పించింది. చంద్రబాబులా కేంద్రం నిధులకు కన్నమేయకుండా పారదర్శకత పాటించామని నిరూపించింది.

అందుకే జగన్ దక్షతకు తాజాగా కేంద్రం కూడా స్పందించింది. రెండు సంవత్సరాలుగా చంద్రబాబు దోపిడీ కథలతో రూపాయి విదిల్చని కేంద్రం తాజాగా ఏకంగా 1850 కోట్ల రూపాయలను పోలవరానికి విడుదల చేసి ఆశ్చర్య పరిచింది. ఇది పూర్తిగా జాతీయ ప్రాజెక్టు కావడంతో నిర్మాణ ఖర్చు అంతా కేంద్రానిదే.. దీంతో జగన్ సర్కారు రీయింబర్స్ కోసం మరోసారి ఆడిటింగ్ లెక్కలు పంపబోతోంది. దీంతో మరో 3650 కోట్ల రూపాయల నిధులు కేంద్రం విడుదల చేయడానికి రెడీ అవుతోంది.

ఇలా చంద్రబాబు పోలవరాన్ని కేంద్రం నుంచి టేకోవర్ చేసి పూర్తి చేయకుండా నిధులను పక్కదారి పట్టించాడన్న ఆరోపణలున్నాయి. కానీ జగన్ సర్కారు మాత్రం కేంద్రం ఇచ్చే ప్రతీరూపాయికి లెక్కలు చెప్పి నిధులను సాధిస్తుండడం విశేషం. ఏపీ భవిష్యత్తుు మార్చే పథకానికి పురుడు పోస్తోంది.