Begin typing your search above and press return to search.
పోలవరానికి ‘నాబార్డ్’ గ్రీన్ సిగ్నల్
By: Tupaki Desk | 26 Sep 2016 5:05 PM GMTరాజు తలుచుకుంటే జరగందేముంది? ఢిల్లీలో కూర్చున్న ప్రధాని మోడీ ఓకే అనాలే కానీ.. పనులెంత ఫాస్ట్ గా జరగాలో తాజా పరిణామాన్ని చూస్తే ఇట్టే అర్థమైపోతుంది. ఏళ్ల తరబడి సా..గుతున్న పోలవరం ప్రాజెక్టు లెక్క తేల్చేందుకు మోడీ డిసైడ్ అయిన తర్వాత పనులు చేయటానికి అవాంతరాలు ఇంకేం ఉంటాయి. హోదా విషయంలో రాజీ పడితే.. ప్యాకేజీ పేరుతో చేస్తామన్నవి చేసేందుకు సిద్ధమన్న మాటకు తగ్గట్లే ఫలితాలు మొదలయ్యాయి.
పోలవరం ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా అనుకున్న దానికి భిన్నంగా.. ఆ ప్రాజెక్టుకు అయ్యే ఖర్చు మొత్తాన్ని నాబార్డు రుణం ఇవ్వటం.. దానికి సంబంధించిన లెక్క కేంద్రం చూసుకుంటున్న మాటను ఆ మధ్యన కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా అందుకు తగ్గట్లుగా నాబార్డుకు.. పోలవరం జాతీయ అథారిటీకి మధ్య ఒప్పందం ఓకే అయ్యింది. తాజాగా ఢిల్లీలో జరిగిన ప్రత్యేక సమావేశంలో ఈ ప్రాజెక్టుకు సంబంధించి ఒక ఒప్పందం జరిగింది.
దీంతో.. పోలవరం ప్రాజెక్టు నిర్మాణ వ్యయాన్ని నాబార్డు భరించనుంది. ఎఫ్ఆర్ బీఎం లాంటి పరిమితులు ఏమీ లేకుండా పూర్తి స్థాయిలో నాబార్డు బాధ్యత తీసుకోనుంది. తాజాగా జరిగిన ఒప్పందంలో భాగంగా వచ్చే నెల 15న తొలి విడత రుణం ఏపీ సర్కారుకు అందనుంది. అదే జరిగితే.. ఇప్పటివరకూ జరిగిన దానికి భిన్నంగా పోలవరం ప్రాజెక్టు పనులు వేగవంతం కావటమే కాదు.. నిర్మాణానికి అడ్డుగా ఉన్న నిధుల సమస్య తీరిపోతుంది. పోలవరం ప్రాజెక్టు కానీ పూర్తి అయితే.. కొత్తగా 13 లక్షల ఎకరాలకు సాగునీరు అందటంతో పాటు.. విశాఖ నుంచి దిగువన ఉన్న ఏడు జిల్లాలకు నీరు అందనుంది. హోదాను వదులుకున్న ఏపీకి.. మోడీ సర్కరు మాట ఇచ్చినట్లే పోలవరం ప్రాజెక్టు ఖర్చును వందశాతం నాబార్డు ఖర్చు చేయనుంది. తాజాగా జరిగిన ఒప్పందం నేపథ్యంలో నిధులకు ఎలాంటి కొరత లేని నేపథ్యంలో ప్రాజెక్టు పనులు పూర్తి కావటం మీదనే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టి పెడితే సరిపోనుంది.