Begin typing your search above and press return to search.
తాగుబోతులకు పోలీసుల ఝలక్..
By: Tupaki Desk | 18 Jan 2019 8:50 AM GMTడ్రంకెన్ డ్రైవ్.. ఇప్పుడు తాగుబోతులకు ఇదంటేనే దడ పుడుతోంది. తాగడం మానేయడం సాధ్యం కాకపోతే ప్రత్యామ్మాయ మార్గాల్లో తప్పించుకుంటున్నారు. తాగి దొరికితే ఫ్యామిలీ ముందు కౌన్సిలింగ్ లు - కోర్టుకు వెళ్లడాలు తప్పకపోవడంతో అంతా జాగ్రత్త పడుతున్నారు.
అయితే తాగుబోతులను ఇక కౌన్సిలింగ్ లతో వదిలేది లేదని పోలీసులు నిర్ణయం తీసుకున్నారు. తాగితే జీవితకాలం గుర్తిండిపోయేలా పోలీస్ ట్రీట్ మెంట్ ఉండబోతుదట.. మద్యపాన ప్రియులకు హైదరాబాద్ లో గట్టి షాక్ ఇచ్చేందుకు పోలీసులు రెడీ అయ్యారు.
అన్ని బాధలను మర్చిపోవడానికి మందేసే వారు ఇక ఆలోచించుకోవాల్సిందే.. ప్రభుత్వ ఉద్యోగుల నుంచి ప్రైవేటు ఉద్యోగుల వరకు అందరికీ ఒకటే శిక్ష విధించనున్నారు. దూర ప్రాంతాల నుంచి హైదరాబాద్ లో ఉద్యోగం మీద ఆధారపడి జీవితం నెట్టుకొచ్చే వాళ్లు ఇక పెట్టి బేడా సర్ధుకునేలా పోలీసులు కఠిన నిబంధనలు పొందుపరిచారు.
పొరపాటున డ్రంకెన్ డ్రైవ్ లో దొరికితే చిన్న చితకా ఉద్యోగుల నుంచి సాఫ్ట్ వేర్ ఉద్యోగుల వరకు వారి ఉద్యోగం పోవడం ఖాయంగా కనిపిస్తోంది. తాగి దొరికిన ఉద్యోగుల వివరాలను ఆయా కంపెనీల ఉన్నతాధికారులకు పంపించడమే కాకుండా తాగుబోతు ఉద్యోగులకు ఉద్వాసన పలకండని పోలీసులు ఉన్నతాధికారులు కంపెనీల హెచ్.ఆర్ డిపార్ట్ మెంట్ కు ఫిర్యాదు చేయడానికి పోలీసు శాఖ సిద్ధమైంది. పోలీసులే లేఖలు రాసి తొలగించాలని కోరితే కంపెనీలు ఊరుకుంటాయా.. సో తాగితే ఇక హైదరాబాదీ ఉద్యోగుల ఉద్యోగాలు ఊడిపోతున్నాయన్న మాట..తాజాగా గచ్చిబౌలిలోని ఓ సాఫ్ట్ వేర్ ఉద్యోగి మద్యం తాగి పట్టుబడితే సదురు కంపెనీ హెచ్ ఆర్ డిపార్ట్ మెంట్ కు సమాచారం ఇచ్చారు పోలీసులు. దీంతో అతడిని ఉద్యోగం నుంచి తీసేసింది. తస్మాత్ జాగ్రత్త మరి.