Begin typing your search above and press return to search.

అసెంబ్లీ ముట్టడి యత్నం.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అరెస్ట్ !

By:  Tupaki Desk   |   11 Sep 2020 1:00 PM GMT
అసెంబ్లీ ముట్టడి యత్నం.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అరెస్ట్ !
X
ప్రస్తుతం తెలంగాణలో అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. ఈ సమయంలో బీజేపీ సెప్టెంబర్ 17వ తేదీన తెలంగాణ విమోచన దినోత్సవాన్ని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని అసెంబ్లీ ముట్టడికి పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో అసెంబ్లీ ముట్టడించడానికి ప్రయత్నించిన బీజేపీ కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు. అలాగే ఈ ముట్టడి కార్యక్రమంలో పాల్గొన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ కుమార్‌ ను కూడా పోలీసులు అరెస్టు చేసి, గోషామహల్‌ పోలీస్ స్టేషన్ ‌కు తరలించే ప్రయత్నం చేశారు. తరలించారు. దీంతో బండి సంజయ్‌ను స్టేషన్‌కు తరలిస్తున్న పోలీసు వాహనానికి బీజేపీ కార్యకర్తలు అడ్డంగా పడుకుని , వాహనం ముందుకు పోకుండా అడ్డుకున్నారు. అలాగే, పోలీసులతో వాగ్వాదానికి దిగారు. దీంతో పోలీసులు వారిని కూడా అదుపులోకి తీసుకొని గోషామహల్‌ పోలీస్ స్టేషన్ కు తరలించారు.

బీజేపీ ఇచ్చిన పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల నుండి పెద్ద ఎత్తున బిజెపి కార్యకర్తలు అసెంబ్లీ ముట్టడికి తరలి వెళ్ళే ప్రయత్నం చేశారు. కానీ పోలీసులు ఎక్కడికక్కడ కార్యకర్తలను అరెస్ట్ చేశారు. బిజెపి నాయకులు రామచంద్ర రావు, మోత్కుపల్లి ఇంటివద్దనే పోలీసులు అడ్డుకున్నారు . అసెంబ్లీ ముట్టడికి వచ్చిన ఖమ్మం, నల్గొండ, భద్రాచలం కార్యకర్తలను రవీంద్రభారతి చౌరస్తా లో పోలీసులు అరెస్ట్ చేశారు . రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల నుండి పెద్ద ఎత్తున కార్యకర్తలు అసెంబ్లీ ముట్టడికి బయల్దేరడంతో జిల్లాల వారీగా ఎక్కడికక్కడ బీజేపీ కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేస్తున్నారు

ఈ సందర్భంగా బండి సంజయ్‌ మీడియాతో మాట్లాడుతూ .. బీజేపీ తలపెట్టిన ఈ అసెంబ్లీ ముట్టడి కార్యక్రమం విజయవంతమైందని, బీజేపీ తెలంగాణ ప్రజల పక్షాన ఉందని, నిజాం, రజాకార్ల పక్షాన కేసీఆర్‌ ఉన్నారని బండి సంజయ్ విమర్శలు కురిపించారు. తెలంగాణ విమోచన దినోత్సవం అధికారికంగా నిర్వహించాలనే డిమాండ్‌ అసెంబ్లీ ముట్టడితో మరోసారి రుజువయిందని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పోలీసుల బలప్రయోగంతో బీజేపీ నాయకులు, కార్యకర్తలను టీఆర్ ఎస్ ప్రభుత్వం అక్రమంగా అరెస్టులు చేయించిందని ఆరోపించారు. త్వరలోనే కేసీఆర్‌ ను ఫామ్ ‌హౌస్ ‌కే పరిమితం చేస్తామని బండి సంజయ్‌ చెప్పుకొచ్చారు.