Begin typing your search above and press return to search.

అశ్లీల దృశ్యాలను డౌన్‌ లోడ్‌ చేసారో అరెస్టే !

By:  Tupaki Desk   |   4 Dec 2019 8:45 AM GMT
అశ్లీల దృశ్యాలను డౌన్‌ లోడ్‌ చేసారో అరెస్టే !
X
లైంగిక నేరాలను అదుపు చేయడంలో పోలీసులు కొత్త బాటలు పడుతున్నట్లు తెలుస్తోంది. పైరసీ సినిమాల సృష్టికర్తలను ఏమీ చేయలేని పోలీసు శాఖ పైరసీ సినిమాలను డౌన్ లోడ్ చేసుకునే వారిపై ప్రతాపం చూపి గతంలోనే అభాసు పాలైన విదంగా ఇప్పుడు చిన్నారులు అసభ్య చిత్రాలను చూసినా, డౌన్ లోడ్ చేసినా అరెస్టు చేసిపడేస్తామని ప్రకటన చేశారు. కాగా ఈ ప్రకటనపై నెటిజన్లు పలు విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ హెచ్చరిక కచ్చితంగా అమలు చేస్తే రాష్ట్రంలోని 50 శాతం మందిని అరెస్ట్ చేయాల్సి వస్తుందని చెప్తున్నారు.

చిన్నారుల అసభ్య చిత్రాలను చూసినా, డౌన్‌లోడ్‌ చేసినా, మొబైల్‌లో నిక్షిప్తం చేసినా అరెస్టు చేస్తామని చెన్నై డీజీపీ రవి మంగళవారం ప్రకటించారు. మహిళలు, పురుషులకు సంబంధించిన నేరాలు హెచ్చుమీరిపోతున్న పరిస్థితుల్లో సంబంధిత నిరోదక శాఖ అదనపు డీజీపీ మంగళవారం పలు ఆదేశాలు జారీ చేశారు. చిన్నారుల అసభ్య చిత్రాలను వినియోగించేవారిలో దేశంలోనే తమిళనాడు అధికంగా ఉన్నట్లు అమెరికాకు చెందిన ఒక సంస్థ జరిపిన సర్వేలో స్పష్టం చేసినట్లు ఆయన తెలిపారు. ఈ సర్వే ఆధారంగా పలు చర్యలను చేపట్టబోతున్నట్టు ఆయన చెప్పారు.

చిన్నారుల అసభ్య చిత్రాలను చూసేవారే కాక, వాటిని డౌన్‌లోడ్‌ చేసే వారిపై కూడా కఠిన చర్యల కింద అరెస్టు చేస్తామని ఆయన తెలిపారు. మొబైల్‌ ఫోన్, ఇంటర్నెట్‌ తదితరాల ద్వారా ఎంతో మంది అసభ్య చిత్రాలను చూస్తున్న ప్రస్తుతం పరిస్థితులలో డీజీపీ హెచ్చరిక హాస్యాస్పదమైన ప్రకటన అని నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు. ఈ ఆధునిక భారత దేశంలో పోర్నో వీడియోలను పురుషులతో పాటు సమానంగా మహిళలు కూడా చూస్తున్నారని, సామాజిక సర్వేలు చెబుతున్న నేపథ్యంలో లైంగిక చిత్రాలు, అసభ్య దృశ్యాలను చూస్తున్నందుకు ఎవరిని అరెస్టు చేస్తారు అనేది ప్రశ్నార్థకంగా మారుతోంది.