Begin typing your search above and press return to search.

అయ్యన్న ఇంటికి పోలీసులు...అరెస్ట్ ఖాయమా... ?

By:  Tupaki Desk   |   23 Feb 2022 7:30 AM GMT
అయ్యన్న ఇంటికి పోలీసులు...అరెస్ట్ ఖాయమా... ?
X
విశాఖ జిల్లాకు చెందిన మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు నివసించే నర్శీపట్నంలోని ఆయన ఇంటికి నల్లజర్ల పోలీస్ స్టేషన్ కి చెందిన పోలీసులు చేరుకున్నారు. ఆయనకు నోటీసులు ఇచ్చేందుకు వచ్చామని పోలీసులు చెబుతున్నారు.

ఆయన్నను స్వయంగా కలసి నోటీసులను అందచేస్తామని వారు అంటున్నారు. అయితే ఇంట్లో లేరని ఫ్యామిలీ మెంబర్స్ చెప్పడంతో అక్కడ పోలీసులు వెయిట్ చేస్తున్నారు. ఇదిలా ఉండగా అయ్యన్నకు నోటీసులు ఇచ్చి విచారణ కోసం పోలీస్ స్టేషన్ కి తీసుకువెళ్తామని పోలీసులు చెబుతున్నారు.

అయితే పోలీసులు అయ్యన్న ఇంటికి వచ్చారన్న వార్తల నేపధ్యంలో టీడీపీ క్యాడర్ అప్రమత్తం అయింది. పెద్ద ఎత్తున అక్కడకు అయ్యన్న అనుచరులు, టీడీపీ కార్యకర్తలు చేరుకుంటున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణ నెలకొంది. ఈ మధ్యన అయ్యన్న నల్లజర్లకు వెళ్ళినపుడు ఎన్టీయార్ విగ్రాహావిష్కరణ సందర్భంగా జరిగిన సభలో ముఖ్యమంత్రి జగన్ మీద అనుచితమైన కామెంట్స్ చేశారంటూ అందిన ఫిర్యాదు మేరకు అక్కడ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు అయింది.

మరి విచారణ కోసం అయ్యన్న ఇంటికి వచ్చామని చెబుతున్న పోలీసులు ఆయన్ని అరెస్ట్ చేసే అవకాశం ఉందని అంటున్నారు. గతంలో కూడా ఇలాగే ఒక కేసులో అయ్యన్నను అరెస్ట్ చేసేందుకు పోలీసులు ప్రయత్నం చేయగా ఆయన కోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకున్నారు.

అప్పట్లో అయ్యన్న కొంతకాలం గాయబ్ అయ్యారని కూడా వైసీపీ నేతలు చెబుతారు. మరిపుడు కూడా అయ్యన్న ఇంట్లో లేరు అని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. అయ్యన్నను అరెస్ట్ చేయాలనుకోవడం కుదరదని టీడీపీ నేతలు అంటున్నారు. మొత్తానికి అయ్యన్న తన నోరుకు పనిచెబుతూంటే పోలీసులు కేసులు పెడుతున్నారు.

ఇలా మూడేళ్ళుగా జరుగుతున్నా అయ్యన్న మాత్రం అరెస్ట్ కావడంలేదు, అయితే అయ్యన్న ముఖ్యమంత్రిని వ్యక్తిగతంగా టార్గెట్ చేయడం విమర్శల పరిధి దాటి అనుచితంగా కామెంట్స్ చేయడంతో వైసీపీ నేతలు మండిపోతున్నారు. అయ్యన్నను అరెస్ట్ చేయాలని వారు డిమాండ్ చేస్తూంటే ఈ టీడీపీ పెద్దాయన మాత్రం ఎక్కడా చిక్కకుండా దొరకకుండా తనదైన రాజకీయ వ్యూహాలను అమలు చేస్తున్నారు.

మొత్తానికి అయ్యన్న ఇంటికి పోలీసులు రావడం ఇపుడు హాట్ టాపిక్ గా ఉంది. నిజంగా ఈ కేసులో అయ్యన్నను పోలీసులు అరెస్ట్ చేస్తే అది సంచలనమే అవుతుంది. ఏపీలో కొత్త డీజీపీ వచ్చారు. ఒక బడా టీడీపీ నేతను అరెస్ట్ చేస్తే కనుక అది మళ్లీ రాజకీయ ప్రకంపనలు రేపడమే కాకుండా కొత్త డీజీపీ మీద కూడా టీడీపీ ఫోకస్ పెట్టే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని అంటున్నారు.