Begin typing your search above and press return to search.
మహాపాదయాత్రలో ‘మహా’ ఘోరం.. ఏపీలో ఉద్రికత్త..!
By: Tupaki Desk | 11 Nov 2021 10:16 AM GMTఎన్నో ఆశలతో ఏపీ ప్రజలు కిందటి అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీని గెలిపించారు. జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నేతగా ప్రజల్లో మంచిగా గుర్తింపు పొందడటంతో ప్రజలంతా ఆయనకు ఓసారి అవకాశం కల్పించారు. ఈ కారణంగానే ఆయనకు గతంలో ఏ పార్టీకి రానని సీట్లు దక్కాయి. ఏపీలో 151 సీట్ల బంపర్ మెజార్టీతో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చారు.
టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేపట్టారు. ఆ సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చే ప్రయత్నం ఆయన చేస్తున్నారు. అప్పో సప్పో చేసి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని నడిపిస్తున్న తీరును కొందరు మెచ్చుకుంటుండగా మరికొందరు మాత్రం పెదవి విరుస్తున్నాయి. ఇదే సమయంలో ఏపీ వికేంద్రీకరణ పేరుతో ఏపీ సర్కారు నవ్యాంధ్రకు మూడు రాజధానుల కాన్సెప్ట్ తెరపైకి తీసుకొచ్చింది.
టీడీపీ హయాంలో అమరావతిని ఏపీ రాజధానిగా ప్రకటించారు. ఆ సమయంలో ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్మోహన్ రెడ్డి సైతం దీనిని స్వాగతించారు. అయితే అధికారంలోకి వచ్చాక జగన్మోహన్ రెడ్డి మూడు రాజధానుల నిర్ణయానికి కట్టుబడి ముందుకెళుతున్నారు. దీంతో అమరావతి రాజధాని కోసం వేలఎకరాల భూములు ఇచ్చిన రైతులంతా ఈ ప్రాంతమే రాజధాని ఉండాలంటూ ఉద్యమాలు చేపడుతున్నారు.
గడిచిన ఏడాదికిపైగా అమరావతి రైతులు దీక్షలు, నిరసనలు చేపడుతున్నారు. అయితే ప్రభుత్వం మాత్రం వారిని సమస్యలను పట్టించుకోకపోగా మొండి అమరావతి రాజధానిని విశాఖకు తరలించే ప్రయత్నం చేస్తోంది. కోర్టు ఎన్ని మొట్టికాయలు వేసి ప్రభుత్వం మాత్రం తాను చేయదలుచుకున్నదే చేస్తున్నారు. ఇదేక్రమంలో అమరావతి రైతులు మహాపాదయాత్ర పేరుతో రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్రకు శ్రీకారం చుట్టారు.
కొద్దిరోజులుగా అమరావతి రైతులు పాదయాత్ర చేపడుతూ ప్రజల మద్దతును కూడగట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఈక్రమంలోనే నేడు చదలవాడ వద్ద పోలీసులు పాదయాత్ర చేస్తున్న రైతులపై లాఠిచార్జి చేపట్టారు. ఈ సంఘటనలో నాగార్జున అనే రైతు చేయి విరిగింది. పోలీసులు కావాలనే తమపై దాడి చేశారనే కారణంతో రైతులు పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తతలకు దారితీసింది.
ఈక్రమంలోనే రైతులకు ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీలు మద్దతుగా నిలుస్తున్నాయి. జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నాడు టీడీపీ ఇలానే వ్యవహరిస్తే జగన్ సీఎం అయ్యేవారా? అనే కామెంట్స్ విన్పిస్తున్నాయి. ఇప్పటికైనా సీఎం జగన్మోహన్ రెడ్డి అమరావతి రాజధాని తరలింపును వెనక్కి తీసుకోవాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.
ఈ విషయం తెలుసుకున్న టీడీపీ నేత నారా లోకేష్ రైతులకు తాము అండగా ఉంటామని ప్రకటించారు. రైతులపై పోలీసులు చేసిన లాఠిఛార్జిని ఖండిస్తున్నట్లు తెలిపారు. ఈ దాడిలో గాయపడిన వారికి ప్రభుత్వం మెరుగైన సదుపాయం కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ వివాదం కాస్తా చినికిచినికి గాలివాన మారనుండటంతో సీఎం జగన్మోహన్ రెడ్డి దీనిపై ఎలా నిర్ణయం తీసుకుంటారనేది మాత్రం ఆసక్తిని రేపుతోంది.