Begin typing your search above and press return to search.
మోహన్ బాబు హౌస్ అరెస్ట్!
By: Tupaki Desk | 22 March 2019 5:11 AM GMTకీలకమైన ఎన్నికల వేళ ప్రముఖ సినీ నటుడు.. శ్రీవిద్యానికేతన్ విద్యాసంస్థల అధినేత మోహన్ బాబు తలపెట్టిన నిరసన ర్యాలీపై పోలీసులు ఆంక్షలు విధించారు. ప్రభుత్వం ఫీజ్ రీయింబర్స్ మెంట్ ఆలస్యం చేస్తుందని.. దీని కారణంగా భారీగా ఫీజు బకాయిలు పేరకుపోయినట్లుగా పేర్కొన్న ఆయన.. తిరుపతిలో దీనిపై నిరసన ర్యాలీకి పిలుపునిచ్చారు.
శ్రీవిద్యానికేతన్ విద్యాసంస్థలకు సంబంధించి ఏపీ ప్రభుత్వం నుంచి రావాల్సిన రూ.9కోట్ల చెల్లింపుల విషయంలో ఏళ్ల తరబడి ఎదురుచూస్తున్నట్లు చెప్పారు. ఇదే విషయంపై పలుమార్లు ఏపీ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా ఎలాంటి ప్రయోజనం లేదన్నారు. ప్రభుత్వ వైఖరిని తప్పు పడుతూ పదివేల మంది విద్యార్థులతో కలిసి కాలేజీ నుంచి తిరుపతి వరకూ భారీ ర్యాలీకి మోహన్ బాబు పిలుపునిచ్చారు.
ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న వేళ ర్యాలీలకు అనుమతి ఇవ్వలేమని పేర్కొన్న పోలీసులు మోహన్ బాబును అడ్డుకున్నారు. పోలీసుల తీరుపై మోహన్ బాబు అసంతృప్తి వ్యక్తం చేశారు. అయినప్పటికీ ఎన్నికల కోడ్ వేళ నిరసన ర్యాలీలకు అవకాశం లేదన్న వారు.. మోహన్ బాబును గృహనిర్బంధం చేశారు. దీంతో అక్కడి వాతావరణం ఉద్రిక్తంగా ఉన్నట్లు చెబుతున్నారు. మోహన్ బాబు పిలుపు నేపథ్యంలో ఈ రోజు ఉదయం పెద్ద ఎత్తున పోలీసులు విద్యానికేతన్ వద్దకు చేరుకున్నారు. నిరసన ర్యాలీ జరగకుండా జాగ్రత్తలు తీసుకున్నారు.