Begin typing your search above and press return to search.
పోలీసులు లాఠీతో కొట్టారు.. విద్యుత్ ఉద్యోగులు కరెంట్ ఆపేశారు
By: Tupaki Desk | 23 May 2021 5:30 AM GMTలాక్ డౌన్ లో నిబంధనలు పక్కాగా అమలు కావాలి. అదే సమయంలో పోలీసులు తమ లాఠీలకు అదే పనిగా పని చెప్పటం సరికాదు. సంయమనంతో వ్యవహరించటం చాలా ముఖ్యం. లాక్ డౌన్ వేళలు మొదలైన వెంటనే.. లాఠీలకు పని చెప్పేయటం.. రోడ్డు మీద ఎవరు కనిపించినా.. ఎందుకు వచ్చారన్న ప్రశ్న వేస్తూనే.. మరోవైపు లాఠీని ఝుళిపించిన వైనం నల్గొండలో అనూహ్య పరిణామాలకు దారి తీసేలా చేసిందా? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది.
నల్గొండ జిల్లాలోని నాంపల్లిలో విధులు ముగించుకొని తిరిగి వస్తున్న విద్యుత్ ఉద్యోగిని పోలీసులు కొట్టారు. అత్యవసర సేవల్లో భాగంగా లాక్ డౌన్ నుంచి విద్యుత్ ఉద్యోగులకు మినహాయింపు ఉంది. శనివారం ఉదయం కూడా ఇలాంటి పరిస్థితులే చోటు చేసుకున్నాయి. ఈ క్రమంలో నల్గొండ పట్టణంలో ఉదయం 11 గంటల నుంచి రెండు లైన్లు బ్రేక్ డౌన్ అయ్యాయి. మూడు గంటల పాటు కరెంటు లేకుండా పోయింది. దీనికి కారణం.. పోలీసులు తమను అదే పనిగా కొడుతున్న నేపథ్యంలో టిట్ ఫర్ టాట్ అన్నట్లుగా విద్యుత్ సరఫరాను విద్యుత్ ఉద్యోగులు నిలిపివేసినట్లుగా చెబుతున్నారు. వీరు విద్యుత్ నిలిపివేసిన ప్రాంతాల్లో పోలీసు స్టేషన్లు కూడా ఉన్నాయని చెబుతున్నారు.
పోలీసులు లాఠీలకు పని చెప్పి.. విద్యుత్ ఉద్యోగుల్ని వేధిస్తున్నందునే విద్యుత్ సరఫరాను నిలిపివేసి విద్యుత్ ఉద్యోగులు తమ నిరసన తెలియజేశారన్న మాట సోషల్ మీడియా.. వాట్సాప్ గ్రూపుల్లో వైరల్ అయ్యింది. అయితే.. ఇదేమీ నిజం కాదని.. బ్రేక్ డౌన్ కావటం వల్లే విద్యుత్ సరఫరా ఆగినట్లుగా కవర్ చేయటం షురూ అయ్యింది. ఒకవేళ అదే నిజమైతే.. ట్రాన్స్ కో సీఎండీ.. విద్యుత్ శాఖా మంత్రి మొదలు డీజీపీ సైతం ఈ విషయం గురించి మాట్లాడుకోవాల్సి అవసరం ఏముందన్న ప్రశ్న తలెత్తుతోంది.
ఫీడర్లు బ్రేక్ డౌన్ అయినా సరి చేయకపోవటానికి కారణం పోలీసుల వైఖరిపై నిరసన తెలియజేయటానికేనని తెలంగాణ ఎలక్ట్ట్రిసిటీ ఎంప్లాయిస్ 1104 యూనియన్ ప్రకటన సోషల్ మీడియాలో జరుగుతున్న వాదనకు బలం చేకూరేలా చేసిందని చెబుతుున్నారు. ఏమైనా.. లాక్ డౌన్ మొదలైన నాటి నుంచి శుక్రవారం వరకు సంయమనంతో వ్యవహరించిన పోలీసులు.. శుక్రవారం రాత్రి మొదలు శనివారమంతా పెద్ద ఎత్తున లాఠీలకు పని చెప్పటం హాట్ టాపిక్ గా మారింది. నల్గొండ ఎపిసోడ్ విషయానికి వస్తే.. విద్యుత్ సరఫరాలో అంతరాయం కారణంగా పలు ఆసుపత్రుల్లోని కరోనా పేషెంట్లు తీవ్ర అవస్థలకు గురయ్యారు. పోలీసులు.. విద్యుత్ ఉద్యోగుల మధ్య లొల్లి.. కరోనా పేషెంట్లకు చుక్కలు చూపించిందన్న విమర్శ వినిపిస్తోంది. ఏమైనా.. పోలీసులు తమ లాఠీలకు పని చెప్పాల్సిందే. కానీ.. అందులోనూ ‘న్యాయం’ ఉండాలన్న బేసిక్ పాయింట్ అస్సలు మిస్ కాకూడదు.