Begin typing your search above and press return to search.
వైరల్: ఉమ్మడి పాలనలో ఇలా కనుక కొట్టి ఉంటే
By: Tupaki Desk | 4 Dec 2017 6:54 AM GMTఉస్మానియా విశ్వవిద్యాలయంలో పీజీ విద్యార్థి మురళీ ఆత్మహత్య సందర్భంగా.. క్యాంపస్ హాస్టల్ లో పోలీసుల వ్యవహరించిన తీరుకు నిదర్శనంగా వైరల్ అవుతున్న వీడియో సంచలనంగా మారింది. విద్యార్థులను కొట్టిన కొట్టుడికి.. బాధతో అరుపులు కేకలతో ఉస్మానియా విశ్వవిద్యాలయం దద్దరిల్లుతోంది.
కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలోని తొలి సర్కారుతో పోలిస్తే నానా రకాలుగా తిట్టి.. శాపనార్థాలు పెట్టిన ఉమ్మడి పాలనే చాలా నయమన్న మాట ఇప్పుడు ఉస్మానియా విద్యార్థుల నోటి నుంచి వస్తోందట. ఉస్మానియా వర్సిటీలో పీజీ విద్యార్థి మురళి ఆత్మహత్య నేపథ్యంలో క్యాంపస్ లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. విద్యార్థుల్లో తీవ్ర ఆగ్రహావేశాలు పెల్లుబికాయి. టీఆర్ ఎస్ ప్రబుత్వాన్ని బహిరంగంగానే దుమ్మెత్తి పోస్తున్నారు. ఇదిలా ఉంటే.. క్యాంపస్ లో పోలీసులు వ్యవహరిస్తున్న తీరుపై తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. మురళి మృతదేహాన్ని తరలించే వేళలో క్యాంపస్ హాస్టల్ గదుల్లోకి వెళ్లి మరీ విద్యార్థులపై లాఠీలతో చితకబాదిన వైనం ఇప్పుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోది. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
విద్యార్థులు తమ గదుల్లో ఉన్నప్పటికీ.. తలుపులు బద్ధలుకొట్టినట్లుగా బలంగా తన్ని మరీ లోపలకు వచ్చిన పోలీసులు తమ దగ్గరి లాఠీలతో విచక్షణారహితంగా కొట్టటం వీడియోలో కనిపిస్తోంది.
హాస్టల్ గదిలో ఎవరికి వారు కూర్చున్నప్పటికీ బూతు మాటలు తిట్టి.. ఇష్టం వచ్చినట్లుగా కొట్టటం.. గదిని ఖాళీ చేయించటం.. ఈ సందర్భంగా లాఠీ దెబ్బలకు బాధతో ఆర్తనాదాలు చేస్తున్నా పట్టించుకోకుండా కొట్టటాన్ని పలువురు తప్పు పడుతున్నారు.
రాష్ట్ర ఏర్పాటు కోసం చేసిన ఉద్యమ సమయంలో ఎప్పుడూ కూడా ఇంతటి దౌర్జన్యం చూడలేదని కవరేజీకి వెళ్లిన జర్నలిస్టులు చెబుతున్నారు. విద్యార్థులు అంటేనే కక్ష కట్టినట్లుగా పోలీసుల ప్రవర్తన ఉందన్న మాట వినిపిస్తోంది. చివరకు జర్నలిస్టుల మీద కూడా పోలీసులు తమ జులం ప్రదర్శించినట్లుగా చెబుతున్నారు. కోట్లాడి మరీ పంపించిన ఉమ్మడి పాలకులే కోటి రెట్లు బెటర్ అన్న మాట ఓయూ విద్యార్థుల నోట రావటం తెలంగాణ సర్కారుకు ఇబ్బందికరమన్న మాట పలువురి నోట వినిపిస్తోంది.
వీడియో కోసం క్లిక్ చేయండి