Begin typing your search above and press return to search.
టీడీపీ ప్రచార రథాన్ని అడ్డుకున్న పోలీసులు.. కుప్పంలో టెన్షన్ టెన్షన్
By: Tupaki Desk | 4 Jan 2023 9:52 AM GMTటీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు తన సొంత నియోజకవర్గం కుప్పంలో చేయాల్సిన పర్యటన పై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. తాజాగా ఏపీ ప్రభుత్వం తీసుకువచ్చిన జీవో - 1/2023ని చూపుతూ.. అడ్డంకులు సృష్టిస్తున్నారని.. టీడీపీ నాయకులు చెబుతున్నారు. ఈ జీవో ప్రకారం బహిరంగ సభలు, రోడ్ షోలకు అనుమతి ఇవ్వడం లేదని నాయకులు వాపోతున్నారు.
ఇదిలావుంటే.. మూడు రోజుల పర్యటన నిమిత్తం కుప్పంలో చంద్రబాబు ఈ రోజునుంచి వివిధ కార్యక్రమా ల్లో పాల్గొనాల్సి ఉంది. ఈ క్రమంలో ఆయన ప్రచార రథాన్ని ఎక్కి.. ప్రజల మధ్యకు వెళ్లాలని నిర్ణయించు కున్నారు. ఇప్పటికే సిద్ధమైన ప్రచార రథం.. నియోజకవర్గంలోని శాంతిపురం మండలానికి తీసుకువెళ్లేం దుకు నాయకులు రెడీ అయ్యారు. అయితే.. ఈ వాహనానికి అనుమతి లేదంటూ.. పోలీసులు అడ్డుకున్నారు.
అంతేకాదు.. వాహనం డ్రైవర్‌నుఅదుపులోకి తీసుకున్నారు. ఆయన డ్రైవింగ్ లైసెన్స్ సహా.. వాహన తాళాలను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నట్టు తెలుగుదేశం పార్టీ నాయకులు తెలిపారు. దీనిపై వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. శాంతిపురం మండలం పెద్దూరు, శివకురుబూరు గ్రామాల్లో నిర్వహించనున్న 'ఇదేంఖర్మ రాష్ట్రానికి' కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొనాల్సి ఉంది.
అయితే.. ఆయా కార్యక్రమాల కోసం.. ప్రత్యేకంగా రథాన్ని రెడీ చేశారు. అయితే.. దీనిని ఆదిలోనే పోలీసులు అడ్డుకోవడంతో తమ్ముళ్లు ఆవేదన, ఆందోళన కూడా వ్యక్తం చేశారు. మరోవైపు.. చంద్రబాబు ఇప్పటికే అనంతపురం జిల్లాకు చేరుకున్నారు. హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో వచ్చిన ఆయన అక్కడ నుంచి కుప్పం కు రోడ్డు మార్గంలో చేరుకుంటారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.