Begin typing your search above and press return to search.
అధికార పార్టీకి దెబ్బ!..చింతమనేనిపై కేసు!
By: Tupaki Desk | 24 Oct 2017 4:43 AM GMTఅధికార టీడీపీకి షాక్ తగిలింది. పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరు ఎమ్మెల్యే చింతమేనని ప్రభాకర్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. గతంలోనూ ఈయనపై అనేక కేసులు నమోదయ్యాయి. సాక్షాత్తూ స్థానిక తహసీల్దార్ వనజాక్షిని తన అనుచరులతో కొట్టించారని ఈయనపై అప్పట్లోనే కేసు నమోదైంది. ఆ తర్వాత ఇసుక అక్రమ తరలింపుపై కూడా ఆయనపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ క్రమంలోనే సీఎం చంద్రబాబు స్వయంగా ఆయనను అమరావతికి పిలిచి గట్టి వార్నింగ్ ఇచ్చారు. అయినా కూడా ఆయనలో ఎక్కడా మార్పు రాలేదు. స్థానిక సమస్యలను పరిష్కరించడం మానేసిన ఆయన సొంత వ్యాపారాలు చక్కదిద్దుకోవడంపైనే దృష్టి పెట్టారని పెద్ద ఎత్తున కథనాలు వచ్చాయి. దీంతో ఆయన విలేకరులపైనా ఫైరయ్యారు. స్థానిక పత్రికల విలేకరులపై దాడులు చేయించారు. దీంతో ఆయా విషయాలు తీవ్ర సంచలనం సృష్టించాయి. ఇక, తాజాగా పార్టీ అధినేత చంద్రబాబు పిలుపుతో నేతలు అందరూ ``ఇంటింటికీ టీడీపీ`` పేరుతో జనాల్లో తిరుగుతున్నారు.
ఈ కార్యక్రమం ద్వారా ప్రజల సమస్యలను క్షేత్రస్థాయిలో తెలుసుకుని, వాటికి పరిష్కారం చూపించాలి. మరీ పెద్ద సమస్యలైతే నమోదు చేసుకుని సీఎం దృష్టికి తీసుకువెళ్లాలి. ఇదీ ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశం. అయితే, టీడీపీ ఎమ్మెల్యేలు - మంత్రులు సహా అందరూ ఈ కార్యక్రమం వేదికగానే జనాలపై దాడులకు దిగుతున్నారు. ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ నుంచి డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి వరకు తమను ప్రశ్నించిన ప్రజలపై దుర్భాషలకు దిగిన విషయం పత్రికల్లో ప్రముఖంగా వచ్చింది. ఇక, ఇప్పుడు ఇదే కార్యక్రమంలో చింతమనేని రెచ్చిపోయినట్టు ప్రజలు పేర్కొంటున్నారు.
మహిళలు - చిన్నారులపై దౌర్జన్యం చేసిన విషయంలో ఏపీ టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ - ఆయన అనుచరులపై పోలీసులు కేసు నమోదు చేశారు. కొన్ని రోజుల క్రితం పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు మండలం మాదేపల్లి శివారు లింగారావుగూడెంలో ఇంటింటికి టీడీపీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా డ్రైనేజ్ - రోడ్డు సమస్యలను పరిష్కరించమని స్థానికులు విన్నవించుకున్నారు. తమ సమస్యలు విన్నవించుకుంటే మహిళలు - చిన్నారులపై ఎమ్మెల్యే - ఆయన అనుచరులు దౌర్జన్యం చేశారని బాధితులు ఆరోపిస్తూ దెందులూరు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్యేపై కేసు నమోదు చేయాలని ఆ ఫిర్యాదులో బాధితులు డిమాండ్ చేశారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేశారు. మొత్తానికి టీడీపీ ఎమ్మెల్యేల అసహనం మరోసారి బహిర్గతం కావడంపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది.