Begin typing your search above and press return to search.
మాజీ స్పీకర్ కు ‘సన్ స్ట్రోక్’ తప్పలేదు
By: Tupaki Desk | 25 April 2016 4:24 AM GMTతండ్రులకున్న పరపతిని ఇష్టారాజ్యంగా వాడేయటం.. తల్లిదండ్రుల పేరుప్రఖ్యుతల్ని వాడేయటం.. ఇష్టారాజ్యంగా వ్యవహరించటం లాంటి వికారాలు చాలామంది ప్రముఖుల పుత్రరత్నాల్లో చూస్తున్నదే. ఈ మధ్యనే కేంద్రమంత్రి సుజనా చౌదరి కుమారుడు.. అంతకు ముందు.. ఏపీ మంత్రి రావెల కిశోర్ బాబు కుమారుడి పుణ్యమా అని వారి తండ్రుల పేర్లు మీడియాలోకి ఎక్కటం తెలిసిందే. ఈ జాబితాలోనే గంటా పుత్రరత్నం.. బొండా ఉమగారి అబ్బాయి.. ఇలా లచెప్పుకుంటూ పోతే ఈ జాబితా సైజు సాగుతూనే ఉంటుంది.
పలుకుబడి భారీగా ఉండే ఈ నేతల కుమారులు బాధ్యత అన్నది లేకుండా ఇష్టం వచ్చినట్లుగా వ్యవహరించటం.. పోలీసులకు దొరికిపోవటం.. వార్తల్లోకి రావటం ఈ మధ్యన మామూలైంది. తాజాగా ఆ జాబితాలో చేరారు మాజీ స్పీకర్ సురేశ్ రెడ్డి కుమారుడు అమిత్ రెడ్డి. స్పీకర్ పదవికి వన్నె తెచ్చిన సురేశ్ రెడ్డికి తలవంపులు తెచ్చేలా వ్యవహరించాడు. శనివారం అర్థరాత్రి దాటిన తర్వాత కారు.. బైక్ రేసింగ్ ల పేరిట ర్యాష్ గా డ్రైవ్ చేస్తున్న వారిని జూబ్లీహిల్స్ ట్రాఫిక్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
జాగ్వార్ తోపాటు ఆరు కార్లు.. పది బైకుల్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు.. నిందితుల్లో మాజీ స్పీకర్ సురేశ్ రెడ్డి కుమారుడు అమిత్ రెడ్డి ఉన్నట్లు గుర్తించారు. వీరికి జరిమానా విధించి.. వాహనాలు సీజ్ చేసి కౌన్సిలింగ్ ఇవ్వనున్నట్లు పోలీసులు చెబుతున్నారు. ఇలా పట్టుబడిన ప్రముఖల పిల్లలకు జరిమానా విధించి వదిలేస్తే వారు మాట వినే అవకాశం ఉందా..?