Begin typing your search above and press return to search.
క్రైం రేటు తగ్గాలని పోలీసులే జంతు బలిచ్చారు
By: Tupaki Desk | 22 Aug 2015 5:54 AM GMTకోరిన కోర్కెలు నెరవేరితే ఓ కోడినో..ఓ పోతునో బలిస్తామని భక్తులు దేవుళ్లకు మొక్కుకోవడం చూశాం. కానీ ఇక్కడ విచిత్రంగా దేవుడా క్రైం రేటు తగ్గించమంటూ పోలీసులు జంతుబలిచ్చారు. తమిళనాడులోని తిరుచ్చి సమీపాన ఉన్న పోన్ మలై పోలీస్ స్టేషన్ పరిధిలో రోజు రోజుకు క్రైం రేటు పెరిగిపోతోంది. దీంతో ఆ పోలీసులకు ప్రతి రోజు పోలీసు ఉన్నతాధికారుల నుంచి చీవాట్లు తప్పడం లేదు.
హత్యలు, ఆత్మహత్య కేసులను చేధించలేక పోలీసులు నానా ఇక్కట్లకు గురవుతున్నారు. ఇలా క్రైం రేటు పెరిగిపోవడానికి దైవాగ్రహమే కారణమని భావించిన ఆ సర్కిల్ ఇన్ స్పెక్టర్ రాజేంద్రన్ ఆ ప్రాంతంలో పేరున్న దేవుడైన ఎల్లై స్వామికి జంతుబలిచ్చి ప్రత్యేక పూజలు చేశారు. స్వామి తమను కరుణించాలని... ఈ ప్రాంతంలో క్రైం రేటు తగ్గాలని వారు వేడుకున్నారు. వీరిని చూసిన పుదుకోట జిల్లా మాత్తూరు పోలీసులూ కూడా ఇంకాస్త ముందుకెళ్లి యాగం చేశారు.
తమ స్టేషన్ పరిధిలో తరచు హత్యలు ఎక్కువగా జరుగుతుండడంతో వాటిని నివారించాలని కోరుతూ భారీగానే ఖర్చు చేసి పెద్ద యాగం చేశారు. ఈ రెండు సంఘటనలు ఇప్పుడు తమిళనాడులో పెద్ద చర్చకు దారి తీశాయి. వీరి చర్యలను హేతువాదులు ఖండిస్తున్నారు. ప్రాణాలు కాపాడాల్సిన పోలీసులే జంతుబలులు చేయడం ఏంటని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.