Begin typing your search above and press return to search.
శిరీష సూసైడ్ పై ఒక డౌట్.. క్లారిటీ ఇదేనట
By: Tupaki Desk | 18 Jun 2017 6:55 AM GMTక్రైమ్ థ్రిల్లర్‌ను తలపించేలా ఉన్న బ్యూటీషియన్ శిరీష ఆత్మహత్యపై తెలంగాణ పోలీసులు క్లారిఫికేషన్ ఇచ్చిన తర్వాత కూడా పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి. సీన్ టు సీన్ అన్నట్లుగా కళ్లకు కట్టినట్లుగా జరిగింది ఇదేనంటూ పోలీసులు వివరంగా చెప్పిన తర్వాత కూడా పలువురిలో సందేహాలు తీరటం లేదు.
తమ కుమార్తె ఆత్మహత్య చేసుకునేంత పిరికిది కాదన్నది శిరీష తల్లిదండ్రుల మాట. ఆమె మరణం వెనుక మిస్టరీ ఉందన్నది కొందరి సందేహం. దీనికి తగ్గట్లే బయటకు వచ్చిన కొన్ని ప్రచారాలు శిరీష మరణంపై పలు సందేహాలు వ్యక్తమయ్యేలా చేస్తున్నాయి.
తాజాగా వినిపిస్తున్న ప్రధాన సందేహం ఏమిటంటే.. శిరీష ఆరు అడుగుల ఎత్తు ఉంటుందని.. 80 కేజీల బరువు ఉంటుందని.. అంత బరువును సీలింగ్ ఫ్యాన్ రాడ్ ఎలా ఆపుతుందన్నది సందేహం. విన్నంతనే.. అవును కదా? అన్న భావన కలిగించే ఈ సందేహంపై పోలీసులు స్పష్టత ఇస్తున్నారు.
సోషల్ మీడియాలోనూ.. బయటా వినిపిస్తున్న ఈ సందేహానికి పోలీసులు ఇస్తున్న స్పష్టత ఏమిటంటే.. శిరీష ఆరడుగుల ఎత్తు అన్నది అబద్ధమని ఆమె ఎత్తు 5.6 అడుగులు మాత్రమేనని చెప్పారు. ఇక.. ఆమె బరువు కేవలం 65-70 కిలోల మధ్యలో మాత్రమే ఉందని చెబుతున్నారు. చనిపోవాలన్న ఉద్దేశంతోనే ఆమె ఫ్యాన్ కు ఉరి వేసుకున్నారని చెబుతున్నారు. సీలింగ్ ఫ్యాన్ కు వంద కిలోల బరువును తట్టుకోగలదని నిర్ధారించారు.
ఇక.. ఆమె ఒంటి మీద ఉన్న గాయాల విషయానికి వస్తే.. కుకునూరుపల్లి ఎస్ ఐ నివాసం నుంచి తిరిగి వచ్చే క్రమంలో కారులో నుంచి దూకే ప్రయత్నం చేయగా.. ఆమె ఒంటి మీద దెబ్బలు తగిలాయని.. ఆమెపై రాజీవ్.. శ్రవణ్ లు దాడి చేశారని.. ఈ కారణం వల్లే ఆమెకు గాయాలైన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. మరోవైపు.. ఆత్మహత్య చేసుకున్న సమయంలో శిరీష ధరించిన దుస్తుల్ని సేకరించారు. ఆమె లో దస్తుల్ని ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పరీక్షల కోసం పంపించారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/