Begin typing your search above and press return to search.
మోనికా క్రైం స్టోరీపై పోలీసుల క్లారిటీ!
By: Tupaki Desk | 12 Oct 2016 4:36 AM GMTగోవా పెర్ఫ్యూమర్ మోనికా ఘర్డే హత్యకేసులో సెక్యూరిటీ గార్డు రాజ్ కుమార్ సింగ్ చెప్పిన మాటలనే ఒక క్రైం స్టోరీ అనుకుంటుంటే... అది వాస్తవం కాదు అసలు విషయం ఇది అంటూ గోవా డీఐజీ చెబుతున్నారు. ముందుగా ఈ విషయాలపై పోలీసులకు చెప్పిన సింగ్ - మోనికాది అనుకోకుండా జరిగిన హత్య అని - ఆమెను బ్లాక్ మెయిల్ చేద్దామనే ఉద్దేశ్యంతో ఆమెను ఫోటోలు తీద్దామనే ప్రయత్నించాను తప్ప, ఆమెను హత్య చేయాలని కాదని చెప్పుకొచ్చాడు. ఇదే సమయంలో ఆమెపై రాజ్ కుమార్ హత్యాచారం చేశాడా లేదా అనే అంశంపై కూడా సందిగ్దత ఉంది. అయితే తాజాగా పోలీసులు అసలు వాస్తవాలను వెలుగులోకి తెచ్చారు. నిందితుడు రాజ్ కుమార్ సింగ్ చెప్పినట్లు అది ప్రమాదవసాత్తు జరిగిన హత్య కాదని, ఆమెకు ముందుగా ఆమె ఫోన్లోనే మూడు పోర్న్ వీడియో క్లిప్స్ చూపించి, అప్పుడు ఆమెపై అత్యాచారం చేసి, అనంతరం విషయం బయటకు చెబుతుందేమో అని హతమార్చినట్లు గోవా పోలీసులు వెల్లడించారు.
ముందుగా సెక్యూరిటీ సూపర్ వైజర్ గా నటిస్తూ మోనికా ఇంటికి వచ్చిన రాజ్ కుమార్ సింగ్ తలుపు తట్టాడు. మోనిక తలుపు తీయగానే బలవంతంగా లోనికి వచ్చి ఆమెను కత్తితో బెదిరించి - అరిచేలోపే ఆమె నోరు నొక్కేసి బాత్రూంలోకి తీసుకెళ్లాడు. ఈ క్రమంలో తీవ్ర ఆందోళనకు గురైన ఆమె తీవ్రంగా భయపడి దాదాపు సగం స్పృహ కోల్పోయింది. దీంతో ఆమెనుంచి పెద్దగా స్పందనలు రాకపోవడంతో ఆమెను మంచం మీద పడుకోబెట్టి రెండు చేతులు - కాళ్లు కట్టేశాడు. తర్వాత డబ్బులు డిమాండ్ చేయగా - ఆమె తన పర్సులో 4వేలు మాత్రమే ఉన్నాయని, అవి తీసుకొమ్మని చెప్పింది. అయితే ఆ మొత్తం చాలదని - మరింత ఎక్కువ డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేయడంతో తన ఏటీఎం కార్డు తీసుకొమ్మని - పిన్ నెంబరు కూడా చెప్పేసింది. అక్కడితో డబ్బు వ్యవహారం పూర్తయిందనుకున్న రాజ్ కుమార్ తర్వాత ఆమె సెల్ ఫోన్ లాక్కుని - దాని పాస్ వర్డ్ అడిగి ఆమెఫోన్ నుంచే ఆమెకు బలవంతంగా మూడు పోర్న్ వీడియో క్లిప్స్ చూపించి - తర్వాత ఆమెపై అత్యాచారం చేశాడు. ఆ తర్వాత ఆమె పోలీసులకు ఫిర్యాదు చేస్తుందన్న భయంతో పీక పిసికి - దిండుతో ఆమె ముఖం మీద గట్టిగా నొక్కి చంపేసినట్లు డీఐజీ గుప్తా తెలిపారు.
అయితే రాజ్ కుమార్ సింగ్ కి మోనికా ఘర్డే ముందుగానే పరిచయం ఉంది. ఆమె ఇంట్లోకి నేరుగా వెళ్లి తలుపు తట్టగానే ఆమె వచ్చి తలుపు తీయడం కూడా ఈ పరిచయం వల్లే అని చెబుతున్నారు. మొట్టమొదటిసారిగా జూన్ 7వ తేదీన ఈ అపార్టుమెంటులో ఏవైనా ఖాళీ ఫ్లాట్లు ఉన్నాయా అని అడిగేందుకు మోనికా అక్కడకు వచ్చారని, అప్పుడు ఆమెకు ఫ్లాట్ల వివరాలు చెప్పేటప్పుడే ఆమె పట్ల అతడు ఆకర్షితుడయ్యాడయ్యానని చెబుతున్నారు. అప్పటినుంచి ఆమెను జాగ్రత్తగా గమనిస్తూ - ఆ ఇంట్లో ఆమె ఒంటరిగానే ఉంటున్నట్లు తెలుసుకున్నాడు. అప్పటినుంచి ఆమె ఫ్లాట్ లో అణువణువూ అతడు తెలుసుకున్నాడట. అయితే ఇతడి ప్రవర్తనపై తేడా వల్లో ఏమో కానీ జూలై 22న అతడిపై మోనిక సహా ఆ ఫ్లాట్స్ కి చెందిన పలువురి నుంచి ఫిర్యాదులు రావడంతో అతడిని ఉద్యోగం నుంచి తీసేశారు. దాంతోపాటు రెండు నెలల జీతం కూడా ఇవ్వలేదు. దీంతో మోనిక పై ఇంతకముందు వరకూ ఆకర్షణ పెంచుకున్న రాజ్ కుమార్, ఈ పరిణామంతో కక్ష కూడా పెంచుకున్నాడు. ఆమె కారణంగానే ఇదంతా జరిగిందని భావించి... ఆమె పట్ల ఉన్న వ్యామోహం - కక్షలతో ఇలా చేశాడని పోలీసులు వివరించారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/