Begin typing your search above and press return to search.

కరోనా హెచ్చరిక..బయటకి వచ్చారో జైలుకే!

By:  Tupaki Desk   |   17 April 2020 12:10 PM GMT
కరోనా హెచ్చరిక..బయటకి వచ్చారో జైలుకే!
X
క‌రోనా మహమ్మారి తగ్గుముఖం పట్టడం లేదు. రోజురోజుకూ విభంభిస్తూ విల‌య‌తాండ‌వం చేస్తుంది. తెలంగాణ‌లోనూ కరోనా విలయతాండవం చేస్తుంది. ఈ నేప‌థ్యంలో లాక్‌ డౌన్‌ ను మ‌రింత ప‌టిష్టంగా అమ‌లు చేసేందుకు అధికార‌యంత్రాంగం క‌ఠిన నిర్ణ‌యాలు తీసుకుంటోంది. మ‌హ‌మ్మారి వైర‌స్‌ ని అడ్డుకోవాలంటే సామాజిక దూరం ఒక్క‌టే మార్గం కాబ‌ట్టి - ప్ర‌జ‌లంతా త‌మ‌కు స‌హ‌క‌రించాల‌ని హైద‌రాబాద్ సీపీ విజ్ఞప్తి చేశారు. లాక్ డౌన్ కి సహకరించకుండా ..ఇంట్లో నుండి అనవసరంగా బయటకి వస్తే డైరెక్ట్ గా జైలుకే అని అన్నారు.

అలాగే , 24 గంట పాటు కరోనా విధులు నిర్వర్తిస్తున్న పోలీసుల‌కు ప్రజలు కూడా సహకరించాలని సిటీ పోలీస్ కమిషనర్ అంజనీకుమార్. లాక్‌ డౌన్ నిబంధనలు ఉల్లంఘించిన 18 మందిపై కేసులు నమోదు చేశామని చెప్పారు. 3,500 పీటీ కేసులు - నిబంధనలు ఉల్లంఘించిన వివిధ సంస్థలపై 182 కేసులు నమోదు చేశామని తెలిపారు. నిబంధనలు ఉల్లంఘించిన 17 వేల మందిపై ట్రాఫిక్ విభాగం కేసులు నమోదు చేసిందని తెలిపారు. ఇప్పటి వరకు 2,724 వాహనాలను సీజ్ చేసిన‌ట్లుగా తెలిపారు.

మ‌రోవైపు నిరంత‌రం శ్ర‌మిస్తున్న డాక్ట‌ర్ల‌పైనే దాడులు జ‌రుగుతున్నాయ‌ని - అది దారుణ‌మ‌న్నారు తెలంగాణ డీజీపీ మ‌హేంద‌ర్‌ రెడ్డి. డ్యూటీలో ఉన్న వైద్యులు - వైద్య సిబ్బందిపై ఎవ‌రైనా దాడుల‌కు పాల్ప‌డితే కఠిన చర్యలు తీసుకుంటామని డీజీపీ హెచ్చరించారు. 1897-2018 యాక్ట్ ప్రకారం చట్టపరంగా నిందితుల పై కఠిన చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు. 99 శాతం మంది ప్రజలు లాక్‌ డౌన్ నిబంధనలు పాటిస్తున్నారని, 1% మాత్రమే ఉల్లంఘిస్తున్నారని తెలిపారు. అలాంటి వాళ్ళవల్ల ఇన్ని రోజుల కష్టం వృథా అవుతుందని హెచ్చరించారు. అలాగే ఇంట్లో ఉండే పెద్దలు .. అత్యవసరమైతే తప్ప బయటికి పంపించవద్దని అయన కోరారు.