Begin typing your search above and press return to search.
చెన్నుపాటి గాంధీపై దాడి.. కంటికి గాయంపై పోలీసుల వాదన విన్నారా?
By: Tupaki Desk | 5 Sep 2022 4:24 AM GMTవిజయవాడలో రాజకీయ విభేదాల్ని మరింత పెంచేలా.. కక్షలకు తెర తీసేలా చోటు చేసుకున్న దాడితో అక్కడి వాతావరణం మరింత ఉద్రిక్తంగా మారింది. అన్నింటికి మించి బహిరంగంగా దాడి జరిగి.. తీవ్ర గాయాలైన చెన్నుపాటి గాంధీకి.. కంటిచూపు పోయే ప్రమాదం పొంచి ఉందని చెబుతున్నారు. ఇనుప చువ్వతో కంటిని గాయపర్చినట్లుగా అక్కడి వారు చెబుతుంటే.. అందుకు భిన్నమైన వాదనను బెజవాడ పోలీసులు వినిపిస్తున్నారు. తాజాగా విజయవాడ సిటీ పోలీస్ కమిషనర్ కాంతిరాణా టాటా విలేకరులతో మాట్లాడారు.ఈ సందర్భంగా ఆయన నోటి నుంచి వచ్చిన మాటలు వింటే.. విస్మయానికి గురి కావాల్సిందే.
చెన్నుపాటి గాంధీపై వైసీపీ నేతలు పలువురు దాడి చేయటం.. కంటిని బలమైన వస్తువుతో పొడవటం వల్లే.. పెద్ద ఎత్తున రక్తం ధారకట్టటం లాంటి అంశాల్ని స్థానికుల నోటి నుంచి వస్తుంటే.. పోలీసుల వాదన మాత్రం వేరుగా ఉంది. ఒకరినొకరు ఎదురుపడి వాగ్వాదానికి గురైన వేళ.. క్షణికావేశంలో చేతులతో కొట్టుకునే క్రమంలోనే చెన్నుపాటి గాంధీ కంటికి గాయమైనట్లుగా పేర్కొన్నారు. తాము చేపట్టిన దర్యాప్తులోనూ ఇవే విషయాలు వెల్లడైనట్లుగా కాంతి రాణా టాటా వెల్లడించారు.
చేత్తో కొట్టిన గాయాలతోనే కంటికి అంత గాయమైందని.. రక్తం కారినట్లుగా చెబుతున్నారు. ఇదిలా ఉంటే.. ఈ దాడి ఘటన శనివారం సాయంత్రం ఐదు గంటల వేళలో చోటు చేసుకుంటే.. ఆదివారం మధ్యాహ్నం వరకు కేసు నమోదు కాకపోవటం గమనార్హం. టీడీపీ నేతలు ఏసీపీ ఆఫీసుకు వెళ్లి గట్టిగా అడిగిన తర్వాత మాత్రమే పోలీసులు కేసు నమోదు చేసినట్లుగా చెబుతున్నారు. మరింత ఆసక్తికర అంశం.. పోలీసుల తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్న వైనాన్ని చూస్తే.. మారణాయుధాలతో చెన్నుపాటి గాంధీపై దాడి చేస్తే.. దాడి చేసిన వారిపై హత్యాయత్నం.. ప్రమాదకరమైన ఆయుధంతో దాడి.. లాంటి సెక్షన్లను పెట్టకుండా నేరపూరిత బెదిరింపు సెక్షన్ మాత్రమే పెట్టటం విశేషం.
హత్నాయత్నం కేసు ఎందుకు పెట్టలేదని మీడియా ప్రతినిదులు ప్రశ్నించినప్పుడు.. పిడికిలితో కొట్టటం వల్లే కంటికి గాయమైనట్లుగా ఎల్వీ ప్రసాద్ ఆసుపత్రి వైద్యులు తమకు ఇదే విషయాన్ని చెప్పినట్లుగా విజయవాడ సీపీ వెల్లడించారు. గాంధీ ఒంటిపై పదునైన ఆయుధంతో దాడి చేసి గాయపర్చిన ఉదంతం లేదని.. హత్య చేయటానికి నిందితులకు ఒక ఉద్దేశం.. ప్రణాళిక ఉన్నప్పుడు హత్యాయత్నం సెక్షన్ పెడతామని పుస్తకంలోని అంశాల్ని చెప్పుకొచ్చారు.
తాజా ఉదంతంలో తనపై హత్యాయత్నం జరిగిందని బాధితుడు గాంధీ ఫిర్యాదు చేశారు. అందుకు నిదర్శనంగా ఆయన కంటికి అయిన తీవ్ర గాయం ఉంది. ప్రత్యక్ష సాక్ష్యులు కూడా దాడి ఉదంతాన్ని చెప్పుకొచ్చారు. అయితే.. ఈ కేసు నమోదులో ఆలస్యం కావటమే కాదు.. న్యాయ సలహా పేరుతో కాస్తంత కాలం గడిపినట్లుగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఇదంతా ఒక ఎత్తు అయితే.. దాడిలో ముగ్గురు వ్యక్తులు హత్యాయత్నానికి పాల్పడినట్లుగా పేర్లతో సహా గాంధీ కంప్లైంట్ ఇస్తే.. పోలీసులు మాత్రం నిందితుల పేర్లు చెప్పలేదు. పేర్లు చేర్చిన వారు కూడా ఇద్దరే అన్న విషయం బయటకు వచ్చింది. తొమ్మిదో డివిజన్ వైసీపీ ఇన్ ఛార్జి వల్లూరి ఈశ్వర్ ప్రసాద్ ను కేసు నుంచి తప్పించారని.. అందుకే నిందితుల పేర్లు చెప్పటం లేదన్న మాట వినిపిస్తోంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.