Begin typing your search above and press return to search.
రాహుల్ స్నేహితురాల్ని కక్షగట్టిన బీజేపీ నేతలు
By: Tupaki Desk | 8 Feb 2018 10:50 AM GMTమాండ్య నియోజకవర్గం మాజీ కాంగ్రెస్ ఎంపీ రమ్య చిక్కుల్లో పడ్డారు. సోషల్ మీడియాలో యువతను తప్పుదోవ పట్టించేలా వ్యవహరిస్తున్నారంటూ బీజేపీ నేతలు ఆమెపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ప్రతీ మగాడు వెనుక ఓ ఆడది ఉన్నట్లే..అలా రాహుల్ గాంధీ వెనుక రమ్య ఉందనే చెప్పుకోవాలి. రమ్య రాకతో రాహుల్ ఫేమ్ మారింది. సోషల్ మీడియాలో విపరీతమమైన ఫాలోవర్స్ ను సొంతం చేసుకున్నారు. దీనంతటికి కారణం రమ్యేనని ఆ పార్టీకి చెందిన నేతలు చెప్పుకుంటుంటారు. సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉంటూ సమాజాన్ని ఆలోచింపచేసేలా ట్వీట్ చేయడం ఆమె ప్రత్యేకత. ఆ ప్రత్యేకతే నేడు రాహుల్ గాంధీ స్నేహితురాలు అని చెప్పుకోవడానికి కారణమైంది.
ఓ వైపు సినిమాలు చేస్తున్న రమ్యకు రాజకీయాల్లోకి రావాలనే కోరిక ఉండేది. ఆ కోరికతో సినిమాలకు స్వస్తి చెప్పి 2012లో కాంగ్రెస్ పార్టీ తీర్ధం పుచ్చుకొని మాండ్య నియోజకవర్గం నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు. తన ట్వీట్ లతో ప్రత్యర్ధుల్ని సైతం ఇరుకున పెట్టేయడంలో తనకు తనే సాటి అని నిరూపించుకున్న రమ్యను రాహుల్ గాంధీ ఏరి కోరి నేషనల్ కాంగ్రెస్ పార్టీ - రాహుల్ గాంధీ సోషల్ మీడియా టీం విభాగానికి అధిపతిని చేశారు. అప్పటి వరకు నామ మాత్రం గానే ఉన్న ఆ రెండు సోషల్ మీడియా విభాగాల్ని రమ్య పరుగుపెట్టించారు.
అలా 2009లో కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ కు ట్విట్టర్ అకౌంట్ లో ఆరువేల మంది ఫాలోవర్స్ మాత్రమే ఉండేవారు. కానీ రమ్య అదే ఆరువేల సంఖ్యను 60 లక్షల మంది ఫాలోవర్స్ కి చేర్చించింది. కాంగ్రెస్ పార్టీలో థరూర్ కే ఫాలోవర్స్ ఎక్కువ. రాహుల్ గాంధీకి 41 లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు.
ఇందుకోసం రమ్య ఓ పెద్ద టీం ను ఏర్పాటు చేసింది. వారు చేయాల్సిందల్లా ఒక్కటే ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే ఏ చిన్న అంశమైనా సరే దాన్నే అస్త్రంగా చేసుకొని ప్రత్యర్ధుల్ని చావుదెబ్బతీయాలి. ఇప్పుడ రమ్యచేసే పనికూడా అదే. 2019ఎన్నికలకోసం తన టీంను సిద్ధం చేస్తుంది. ఇందులో భాగంగా తన పార్టీ కార్యకర్తలతో సోషల్ మీడియా కాంపెయిన్లను నిర్వహిస్తుంది. కొద్ది రోజుల క్రితం తన సోషల్ మీడియా టీం - కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో భేటీ నిర్వహించిన రమ్య..ఆ కాంపెయిన్ లో ఒక్కో సభ్యుడు నాలుగైదు ఫేక్ ఐడీలను క్రియేట్ చేసుకోవాలని - ఆ అకౌంట్ల నుంచి కాంగ్రెస్ పార్టీ - రాహుల్ గాంధీ అకౌంట్లను ఫాలో అవుతు రీట్విట్ చేస్తూ లైక్స్ కొట్టాలని ఆదేశించింది. ఈ సందర్భంగా టీంలో కొంతమంది సభ్యులు సోషల్ మీడియాలో నకిలీ అకౌంట్లు ఉండడం తప్పు కాదా అంటూ ప్రశ్నించారు..? దీంతో అందులో తప్పేమి ఉంది. నాక్కూడా నాలుగైదు ఫేక్ అకౌంట్లు ఉన్నాయని రమ్య చెప్పుకొచ్చింది.
ఈ తతంగం అంతా వీడియో రూపంలో నెట్టింట్లో హల్ చల్ చేయడంతో రమ్య భాగోతం బట్టబయలైంది. ఓ బాధ్యాతాయుతమైన పదవిలో ఉన్న ఈ మాజీ ఎంపీ నకిలీ సోషల్ మీడియా అకౌంట్లు ప్రారంభించండి అంటూ ప్రొత్సహించడం ఎంతవరకు కరెక్ట్ అని కమలం నేతలు బెంగళూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అంతేకాదు సోషల్ మీడియాలో ఫేమస్ అవ్వాలనే ఉద్దేశంతో ట్విట్టర్ కంపెనీతో రమ్య రాయబారాలు నడుపుతుందేమోననే అనుమానాలు వ్యక్తం చేశారు.
ఇటీవల తాము రాహుల్ గాంధీ సోషల్ మీడియా అకౌంట్లలో ఇతర దేశాల నుంచి ట్వీట్స్ వస్తున్నాయని అవి కూడా ఈమె చేయించి ఉండొచ్చని పేర్కొన్నారు. ఈ నకిలీ వ్యవహారంపై ట్విట్టర్ కంపెనీతో ఆడిటింగ్ చేయించాలని బీజేపీ నేతలు బెంగళూరు పోలీసుల్ని కోరారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.