Begin typing your search above and press return to search.
లగడపాటిపై పోలీసులకు ఫిర్యాదు..కేసు పెడతారా?
By: Tupaki Desk | 27 May 2019 8:17 AM GMTవిభజన నేపథ్యంలో రాజకీయాలకు గుడ్ బై చెప్పిన లగడపాటి రాజగోపాల్ మీద తాజాగా కొవ్వూరు పోలీస్ స్టేషన్ లో ఒక ఫిర్యాదు అందింది. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల ఫలితాలపై లగడపాటి తప్పుడు సర్వే రిపోర్ట్ ఇచ్చారని.. దాని కారణంగా అనేక మంది నష్టపోయినట్లుగా మురళీకృష్ణ అనే న్యాయవాది పోలీసులకు కంప్లైంట్ చేశారు.
లగడపాటి సర్వే కారణంగా పెద్ద ఎత్తున నష్టం జరిగిందని.. తప్పుడు సర్వేల వెనుక ఎవరు ఉన్నారో తెల్చాలంటూ పోలీసులను ఆయన కోరారు. ఈ ఫిర్యాదుపై విచారణ చేసి తగు చర్యలు తీసుకుంటామని అధికారులు చెబుతున్నారు. అయితే.. ఏ లెక్కన కంప్లైంట్ ను కేసు కింద నమోదు చేస్తారు? అన్న ప్రశ్నకు సమాధానం చెప్పలేకపోతున్నారు.
సర్వేను నమ్మమని ఎవరూ చెప్పరు. ఎవరి మీద ఉన్న గురితోనో.. నమ్మకంతోనే నమ్మినా.. దాని కారణంగా జరిగే నష్టం ఏమిటంటే.. బెట్టింగ్ అన్న మాట వస్తుంది. అది చట్టవిరుద్ధమైన నేపథ్యంలో నష్టపోవటం లాంటి మాటకు అర్థం లేదని.. లగడపాటి మీద ఫిర్యాదుతో ఏమీ కాదన్న మాట పలువురి నోట వినిపిస్తోంది. మరి.. కొవ్వూరు పోలీసులు ఈ ఫిర్యాదును ఎలా డీల్ చేస్తారో చూడాలి.