Begin typing your search above and press return to search.
మేయర్ ను చంపేసింది చింటూనే..
By: Tupaki Desk | 14 Dec 2015 9:11 AM GMTచిత్తూరు మేయర్ అనురాధ.. ఆమె భర్త మోహన్ లను హత్య చేసింది చింటూ అలియాస్ శ్రీరామ చంద్రశేఖరేనని చిత్తూరు జిల్లా ఎస్పీ ఘట్టమనేని శ్రీనివాస్ స్పష్టం చేశారు. మేయర్.. ఆమె భర్తను తాను చంపినట్లు నిందితుడు చింటూ ఒప్పుకున్నట్లు వెల్లడించారు. ఈ హత్యలకు సంబంధించిన పలు అంశాల్ని ఎస్పీ మీడియాకు వెల్లడించారు. మేయర్ దంపతుల్ని హత్య చేసేందుకు చింటూ గతంలో ప్రయత్నించారని చెప్పారు.
గడిచిన ఆరు నెలల వ్యవధిలో రెండుసార్లు హత్య చేసేందుకు స్కెచ్ వేశాడని.. అయితే.. రెండు దఫాలు విఫలమయ్యారని ఎస్పీ పేర్కొన్నారు. మూడోసారి తన పథకాన్ని పక్కాగా అమలుచేసి.. వారిద్దరిని హత్య చేసినట్లుగా పేర్కొన్నారు. ఈ హత్యలలో 23 మందికి సంబంధం ఉందన్న ఎస్పీ.. ఇప్పటివరకూ 20 మంది అరెస్ట్ చేసినట్లుగా చెప్పారు. మిగిలిన ముగ్గురిని త్వరలోనే అదుపులోకి తీసుకుంటామని ఆయన వెల్లడించారు.
మేయర్ దంపతుల్ని హత్య చేయటానికి వ్యాపార.. ఆర్థిక పరమైన అంశాలు.. కుటుంబ విభేదాలే కారణమని ఎస్పీ పేర్కొన్నారు. హత్యకు ఉపయోగించిన 7 రివాల్వర్లు.. 13 కత్తులు.. 31 బుల్లెట్లను స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. ఈ కేసుకు సంబంధించిన విచారణ సాగుతుందని.. మరికొందరిని ప్రశ్నిస్తున్నట్లు ఆయన చెప్పారు.
మరోవైపు మేయర్ దంపతుల్ని హత్య చేసేంత దారుణ నిర్ణయాన్ని చింటూ ఎందుకు తీసుకున్నారన్న దానికి వినిపిస్తున్న తాజా కథనం ఏమిటంటే.. మెరైన్ ఇంజనీరింగ్ పూర్తి చేసి ముంబయిలో మంచి ఉద్యోగాన్ని వదిలేసి.. మేనమామ రాజకీయం కోసం చింటూ అండగా నిలిచాడని.. అయితే.. మేయర్ అయ్యాక కటారి దంపతులు చింటూను దూరంగా పెట్టటం వారిపై కోపాన్ని పెంచేలా చేసింది. ఇదే సమయంలో పెళ్లి సంబంధాలు రాకుండా ఉండటంతో పాటు.. పెళ్లి జరగకుండా మేయర్ దంపతులు అడ్డుపడుతున్నారని.. తనను ఒక క్రిమినల్ గా చిత్రీకరించాన్ని తట్టుకోలేకనే వారిని హతమార్చినట్లుగా చెబుతున్నారు.