Begin typing your search above and press return to search.

తెలంగాణలో తొలిసారి.. మాయదారి రోగానికి కానిస్టేబుల్ బలి

By:  Tupaki Desk   |   21 May 2020 4:45 AM GMT
తెలంగాణలో తొలిసారి.. మాయదారి రోగానికి కానిస్టేబుల్ బలి
X
వణికిస్తున్న మాయదారి రోగానికి మరణిస్తున్న కొందరి ఉదంతాలు ప్రజలకు బెరుకు పుట్టిస్తున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో తొలిసారి ఒక పోలీస్ కానిస్టేబుల్ మాయదారి మహ్మమారి బారిన పడి మరణించిన వైనం తాజాగా వెలుగు చూసింది. హైదరాబాద్ కు చెందిన ఈ కానిస్టేబుల్ 2007 బ్యాచ్ కు చెందినవాడిగా చెబుతున్నారు. 37 చిరు ప్రాయంలోనే మాయదారి రోగం బారిన పడిన అతడు.. గాంధీలో చికిత్స పొందుతూ తాజాగా మరణించినట్లుగా చెబుతున్నారు.

కొద్ది రోజుల క్రితం అనారోగ్యానికి గురైన సదరు కానిస్టేబుల్.. రోగ లక్షణాలు కనిపించిన మూడు.. నాలుగు రోజుల పాటు పట్టించుకోకపోవటమే ఇప్పుడీ పరిస్థితికి కారణమైందని చెబుతున్నారు. ఆరోగ్య సమస్యలు పెరగటంతో అనుమానం వచ్చి పరీక్షలు చేయించుకున్నారు. టెస్టు ఫలితాలు వచ్చి పాజిటివ్ అని తేలటంతో అతన్ని గాంధీకి తరలించారు. అయితే.. అప్పటికే మాయదారి రోగం అతన్ని బాగా కమ్మేసినట్లు చెబుతున్నారు. ఈ కారణంతోనే.. చికిత్స పొందుతూనే అతడు మరణించినట్లుగా చెబుతున్నారు. దేశ వ్యాప్తంగా అందుబాటులో ఉన్న గణాంకాల్ని చూస్తే.. మాయదారి రోగానికి గురి అవుతున్న వారి సంఖ్య తక్కువ కాగా.. మరణాల రేటు చాలా తక్కువగా ఉంది.

అయితే.. చిన్న వయసులో ఇలా మరణించటం మాత్రం ఇదే తొలికేసు అవుతుందన్న మాట వినిపిస్తోంది. పాతబస్తీలోని కుల్సంపురా పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ కానిస్టేబుల్ ఉంటారని చెబుతున్నారు. చిన్న వయసులో ఉన్న కానిస్టేబుల్ మాయదారి రోగానికి బలి కావటాన్ని పోలీసు వర్గాలు జీర్ణించుకో లేకపోతున్నాయి.