Begin typing your search above and press return to search.

మంత్రి కొడుక్కి వార్నింగ్ ఇచ్చిన లేడీ కానిస్టేబుల్ !

By:  Tupaki Desk   |   14 July 2020 10:30 AM IST
మంత్రి కొడుక్కి వార్నింగ్ ఇచ్చిన లేడీ కానిస్టేబుల్ !
X
దేశంలో రోజురోజుకి కరోనా మరింత వేగంగా విజృంభిస్తుంది. ఈ నేపథ్యంలో దేశంలో మొత్తం కరోనా నిబంధనలు ఇంకా అమలు లోనే ఉన్నాయి. కానీ , కొంతమంది ఆ నిబంధనలు తమకి వర్తించవు అని ఇష్టానుసారంగా యథేచ్ఛగా తిరుగుతున్నారు. ఇలానే కరోనా నియమాలని బేఖాతరు చేసి రాత్రి రోడ్డు పై తిరుగుతున్న మంత్రి కుమారుడిని , అతని స్నేహితులని ఓ మహిళ కానిస్టేబుల్ అడ్డుకుంది. ఈ ఘటన గుజరాత్ లో చోటు చేసుకుంది.

సూరత్‌ లో కరోనా వైరస్ కారణంగా రాత్రి కర్ఫ్యూ నిబంధనలను ఉల్లంఘించిన మంత్రి కుమారుడు ప్రకాష్‌ ను, అతని స్నేహితులను అక్కడ విధులు నిర్వహిస్తున్న మహిళ కానిస్టేబుల్ సునీతా యాదవ్ నిలదీసింది. దీనితో ఆ మహిళా కానిస్టేబుల్కు ఫోన్ చేసిన మంత్రి కుమారుడు ... ‘మాకు పవర్ ఉంది.. నేను తలుచుకుంటే మమ్మల్ని ఎక్కడ నిలబెట్టావో అదే ప్లేస్‌లో నిన్ను 365 రోజులూ నిల్చోబెడతా’ అని ఫోన్‌ లో మహిళా కానిస్టేబుల్ కి సీరియస్ వార్నింగ్ ఇచ్చాడు. అయితే ఆ వార్నింగ్‌ కు కానిస్టేబుల్ సునీతా యాదవ్ ఎంతమాత్రం బెదరలేదు. " 365 రోజులు అక్కడ నిలబెడితే నిల్చోడానికి నేను నీకు బానిసను కాదు, నీ తండ్రికి సర్వెంట్‌ ను కాదు అని గట్టిగా సమాధానం చెప్పింది. కాగా ఈ ఆడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో సునిత యాదవ్ ధైర్యానికి అందరూ ఆమె పై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ నేపథ్యంలో విచారణ జరిపిన పోలీసు ఉన్నతాధికారులు మంత్రి కొడుకును అదుపులోకి తీసుకున్నారు. అయితే , బెదిరింపులకు భయపడకుండా డ్యూటీ చేసిన ఆ మహిళా కానిస్టేబుల్ ను హెడ్‌క్వార్టర్స్ ‌కి ట్రాన్స్‌ ఫర్ చేశారు.