Begin typing your search above and press return to search.
మధుర పోలీసులు తుపాకీలు వాడటం రాదా?
By: Tupaki Desk | 23 Aug 2015 7:12 AM GMTవినటానికి వింతగా అనిపించినా..ఇది నిజం. పోలీసులకు తుపాకీలకు మధ్య ఉండే అనుబంధం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కానీ.. ఉత్తరప్రదేశ్ లోని మధుర పోలీసులు కాస్త భిన్నం. మధుర పోలీసుల్లో చాలామందికి తుపాకీల్లోని విడి భాగాల గురించి కూడా అవగాహన లేదు. తుపాకీ విడి భాగాల దాకా ఎందుకు.. తుపాకీలు ఎలా కాల్చాలో కూడా తెలీదంట.
ఈ జాబితాలో కానిస్టేబుళ్లు మాత్రమే కాదు.. సీఐ కూడా ఉండటం చూస్తే.. అక్కడి పోలీసుల పరిస్థితి ఎంత దారుణంగా ఉందో ఇట్టే తెలుస్తుంది. ఆ జిల్లా ఎస్పీ పోలీసులందరికి.. కెమేరా సాక్షిగా తుపాకీ కాల్చే అంశంపై టెస్ట్ పెట్టారట. దీంతో.. పోలీసులు ఒత్తిడితో ఉక్కిరిబిక్కిరి అయ్యారట. తప్పనిసరి పరిస్థితుల్లో తమ చేతగానితనాన్ని ఒప్పేసుకున్నారట.
ఈ ఉదంతం గురించి విన్న వారు షాక్ కు గురయ్యే పరిస్థితి. పోలీసులకు తుపాకీల్ని వాడటం కూడా రాదా? అంటూ నోరెళ్ల బెడుతున్నారు. ఇదంతా దగ్గరుండి చూసిన జిల్లా ఎస్పీకి ఒళ్లు మందిపోయి.. వారందరికి హోల్ సేల్ గా శిక్షణ కార్యక్రమాన్ని ప్రత్యేకంగా నిర్వహించాలని నిర్ణయించారు. ఎందుకైనా మంచిది.. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ జిల్లాల వారీగా ఈ పరీక్షలు పెట్టి చెక్ చేసుకోవటం మంచిదేమో.