Begin typing your search above and press return to search.
బుల్లెట్ సౌండ్ వస్తే..రోడ్డు రోలర్ కింద తొక్కేస్తారు
By: Tupaki Desk | 15 Dec 2017 4:17 AM GMTమీకు బుల్లెట్ ఉండి...ఒకవేళ మీరు బెంగళూరుకు వెళితే...కాస్త కాదు..చాలా జాగ్రత్త వహించాల్సిందే. ఎందుకంటే..సాక్షాత్తు బెంగళూరులోనే అధికారులు బుల్లెట్ సైలెన్సర్లను ఇలా తొక్కేస్తున్నారు కాబట్టి. అవును. బెంగళూరులో బుల్లెట్ బైక్ సైలెన్సర్లు తుక్కుతుక్కు అయ్యాయి. ఎందుకంటారా...సౌండ్ తో న్యూసెన్స్ చేస్తున్న కుర్రకారుకి వింత పనిష్మెంట్ ఇచ్చారు. సైలెన్సర్లతో రోడ్లపై సౌండ్ పొల్యూషన్ చేసే కుర్రోళ్లకు బెంగళూరు పోలీసులు ఇలా షాక్ ఇచ్చారు.
నగర పోలీసులు కొన్ని రోజులుగా సిటీలో తనిఖీలు నిర్వహిస్తుండగా 100 రాయల్ ఎన్ ఫీల్డ్ వాహనాలు పట్టుబడ్డాయి. వీటికి సైలెన్సర్లు మార్చిన విషయాన్ని గుర్తించారు. రోడ్లపై బీభత్సమైన సౌండ్ చేస్తూ వెళుతున్నట్లు నిర్ధారించారు. 100 రాయల్ ఎన్ ఫీల్డ్ బైకుల సైలెన్సర్లను కుర్రోళ్ల ముందు ఊడబీకేశారు. నడిరోడ్డుపై వాటిని పోసేసి..రోడ్డురోలర్ తో తొక్కించారు. మోటారు వాహనాల సైలెన్సర్ల మార్పిడి పై అవగాహన కల్పించేందుకే ఈ చర్య చేపట్టినట్టు బెంగళూరు ట్రాఫిక్ పోలీసులు తెలిపారు.
ఈస్ట్ డివిజన్ అసిస్టెంట్ పోలీస్ కమిషనర్ సిద్దలింగప్ప మాట్లాడుతూ.. ఈ చర్యల ద్వారా వాహనదారులు తిరిగి తప్పు చేయరని భావిస్తున్నాను అన్నారు. మరోసారి దొరికితే సీరియస్ యాక్షన్ తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చారు. ఈసారి ఖరీదైన బైక్ లు సీజ్ చేస్తామని హెచ్చరించారు. మోటారు వాహనాల చట్టం ప్రకారం.. సైలెన్సర్ సౌండ్ 80 డెసిబల్స్ దాటితే శబ్ధకాలుష్యంగా గుర్తిస్తారు. ఈ తొక్కించిన సైలెన్సర్ లను రీసైక్లింగ్ చేసి రోగ్గు పక్కన ఉపయోగించే బారికేడ్లను తయారు చేస్తామని కబ్బన్ పార్క్ పోలీసులు తెలిపారు. మోటారు వాహనాల చట్టం సెక్షన్ 119 - 120 ప్రకారం మొదటి తప్పుకు రూ.1000 - రెండోసారి 2వేలు ఫైన్ విధిస్తారు.