Begin typing your search above and press return to search.
బాబుపై మండిపడుతున్న పోలీసులు
By: Tupaki Desk | 26 Jan 2017 9:54 AM GMTఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీరుపై ఆంధ్రప్రదేశ్ పోలీసులు భగ్గుమంటున్నారు. తప్పనిసరి విధి నిర్వహణతోనే సతమతం అవుతుంటే ఉద్దేశ పూర్వక రాజకీయాలతో తమకు నిద్రాహారాలు మానిపోయేలా చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదంతా ఏకకాలంలో కాపుల పాదయాత్రను అడ్డుకోవడం - విశాఖ ఆర్కే బీచ్ లో నిరసనలు నిలిపేయడం - గణతంత్ర దినోత్సవ వేడుకలకు భద్రత కల్పించడం వంటి ఉత్కంఠ భరిత పరిస్థితుల వల్ల. రాష్ట్రంలో ఆందోళనల పర్వం ఒకవైపు, రిపబ్లిక్ దినోత్సవ వేడుకలు మరోవైపు నెలకొన్న నేపథ్యంలో భద్రత - బందోబస్తు కత్తిమీద సాము లా మారాయి. ఉత్కంఠ పరిస్ధితులు చోటు చేసుకునే అవకాశం ఉన్నందున పోలీసుశాఖ అప్రమత్తమైంది.
గణతంత్ర వేడుకల నేపధ్యంలో ఉగ్రముప్పు పొంచి ఉండే అవకాశం లేకపోలేదని కేంద్ర నిఘా వర్గాల హెచ్చరికల నేపధ్యంలో పోలీసులు భద్రతను ఈ కార్యక్రమం వైపు మోహరించారు. విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో జరిగే గణతంత్ర దినోత్సవ వేడుకలకు గవర్నర్ - ముఖ్యమంత్రి - ఇతర ప్రముఖులు - మంత్రులు - ప్రజాప్రతినిధులు - పెద్ద ఎత్తున విద్యార్ధిలోకం హాజరుకానుంది. ప్రభుత్వ శాఖల శకటాలు కొలువుతీరనున్నాయి. పోలీసు బెటాలియన్ దళాలు పరేడ్ నిర్వహించనున్నాయి. దీంతో ఓ వైపు వేడుకలు విజయవంతంగా నిర్వహించడంతోపాటు ఉగ్ర కదలికలను కనిపెట్టే పనిలో పోలీసు - ఇంటిలిజెన్స్ వర్గాలు నిమగ్నమయ్యాయి. ఇదే సమయంలో రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలంటూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ - వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీల మద్దతు ప్రకటించిన క్రమంలో సోషల్ మీడియాలో ప్రచారం ఊపందుకుంది. పొరుగు రాష్ట్రం తమిళనాడులో ‘జల్లికట్టు’ ఆందోళన అనుభవాన్ని బేరీజు వేసుకుంటున్న పోలీసుశాఖ ప్రత్యేక హోదా సోషల్ మీడియా ప్రచారోద్యమంపై దృష్టి సారించింది. అగంతకుల ప్రచారంతో ఉక్కిరిబిక్కిరవుతున్న పోలీసుశాఖ ఇప్పటికే హెచ్చరికలు జారీ చేస్తున్నారు.
ప్రత్యేక హోదా పేరుతో నిర్వాహకులు లేకుండా అనధికారికంగా రాష్ట్రంలో 26వ తేదీన సమావేశాలు నిర్వహించడం ద్వారా హింస చోటు చేసుకునే పరిస్ధితి ఉందనేది పోలీసులకున్న అంచనా. దీంతో బలగాలు రాష్టవ్య్రాప్తంగా అప్రమత్తమై 26వ తేదీన సోషల్ మీడియా సమావేశాలను అడ్డుకునేందుకు కార్యాచరణతో సిద్ధమవుతున్నాయి. అనుమతి లేని సమావేశాలను ఉపేక్షించబోమన్న పోలీసు హెచ్చరికలు సోషల్ మీడియా కార్యకర్తలకు మరింత రెచ్చగొట్టేలా ఉన్నాయంటూ పబ్లిక్ టాక్. అయినా శాంతి భద్రతల దృష్ట్యా తప్పదని ఉన్నతాధికారులు స్పష్టం చేస్తున్నారు. ఇదే సమయంలో ముద్రగడ పద్మనాభం పాదయాత్రతో అప్రమత్తమైన యంత్రాంగం ఆయన్ను ఇంటినుంచి బయటకు రాకుండా నిలువరించడంలో సక్సెస్ అయినా.. అది తాత్కాలికమేనని తెలుస్తోంది. అనుకోకుండా 25 - 26 తేదీల్లో ముద్రగడ బయటకు వస్తే పోలీసుశాఖకు ఊపిరిసలపని పరిస్ధితనే చెప్పాలి. ఏది ఏమైనా 26న రాష్ట్రంలో ఏ పరిస్ధితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధమంటూ పోలీసుశాఖ ధీమా వ్యక్తం చేస్తోంది.
ఏపీకి ప్రత్యేక హోదా కోసం మౌన ప్రదర్శన అయినా, కాపులకు రిజర్వేషన్ లు కల్పించే విషయంలో ముద్రగడ యాత్ర అయిన ప్రజాస్వామ్యయుతంగా సాగే సమయంలో ప్రభుత్వం అనవసరంగా బెట్టుకుపోయి అనుమతి లేదంటూ ఉత్కంఠను మరింత పెంచిందని పోలీసులు చెప్తున్నారు. పాలకులుగా నిర్ణయాలు బాగానే ఉంటాయని కానీ నిద్రహారాలు మాని క్షేత్రస్థాయిలో పనిచేసే తమ పరిస్థితి దారుణంగా ఉందని పోలీసు విభాగంలో కింది నుంచి పై వరకు ఉన్న సిబ్బంది వాపోతున్నారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/