Begin typing your search above and press return to search.
చంద్రబాబు తీరుపై పోలీసు అధికారుల సంఘం లేఖ!
By: Tupaki Desk | 28 Feb 2020 3:30 PM GMT`ఏం తమాషా చేస్తున్నారా....ఏమనుకుంటున్నారు.....మీ అంతు చూస్తాను.....ఇంతమంది జనం వస్తుంటే పోలీసులు ఏం గాడిదలు కాస్తున్నారా.....అసలు నన్నెందుకు అరెస్టు చేస్తున్నారో చెప్పండి......ఏ సెక్షన్ ల ప్రకారం అదుపులోకి తీసకుంటున్నారో రాసివ్వండి.....ఏం తమాషాగా ఉందా....?``ఇవన్నీ ఎవరో అనాకారీ రాజకీయ నాయకుడు మాట్లాడిన మాటలనుకుంటే మీరు పొరపడినట్లే. రాజకీయాల్లో నలభై సంవత్సరాల అపార అనుభవం ఉన్న మాజీ సీఎం చంద్రబాబు అన్న మాటలివి. ఎంతో మంది పోలీసుల అధికారులతో పనిచేసిన బాబు.....భద్రతా కారణాల రీత్యా యాత్ర చేయవద్దని సూచించిన పోలీసులపైనే దురుసుగా ప్రవర్తించడంపై సర్వత్రా విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే చంద్రబాబు వ్యాఖ్యలపై పోలీసు అధికారుల సంఘం స్పందించింది. పోలీసులపై చంద్రబాబు స్థాయి ఉన్న వ్యక్తి ఇటువంటి వ్యాఖ్యలు చేయడం తగదంటూ ఓ లేఖను పోలీసు అధికారుల సంఘం విడుదల చేసింది.
మాజీ సీఎం చంద్రబాబు విశాఖ పర్యటన రసాభాసగా ముగిసిన సంగతి తెలిసిందే. చంద్రబాబు ఉత్తరాంధ్ర ద్రోహి అంటూ.....భారీ సంఖ్యలో విశాఖ వాసులు - వైసీపీ కార్యకర్తలు ఆయన కాన్వాయ్ ను అడ్డుకోవడంతో బాబు వచ్చిన దారినే వెనక్కు వెళ్లాల్సి వచ్చింది. అయితే, ఇంకా తాను సీఎంనే అని భ్రమపడుతోన్న చంద్రబాబు.....తన పర్యటనను స్థానికులు అడ్డుకోవడం... పోలీసులు తనను ఎయిర్ పోర్టు లాంజ్ కు తరలించడం వంటి పరిణామాలు జీర్ణించుకోలేకపోయారు. అందుకే, ఆ అక్కసును పోలీసులపైనా, వైసీపీ ప్రభుత్వంపైనా వెళ్లగక్కారు. ఈ క్రమంలోనే పోలీసులపై తీవ్ర విమర్శలు చేశారు. ఈ నేపథ్యంలో పోలీసు అధికారుల సంఘం స్పందించింది.
సమాజంలోని పరిస్థితులను బట్టి - అప్పటికప్పుడు జరుగుతున్న పరిణామాలను బట్టి పోలీసులు అవసరానికి తగ్గట్టుగా స్పందిస్తుంటారని పోలీసు అధికారుల సంఘం తెలిపింది. ప్రజల భద్రతే పరమావధిగా పోలీసులు 24 గంటలూ విధులు నిర్వర్తిస్తుంటారని, ఈ సంగతి 14 ఏళ్లు సీఎంగా పనిచేసిన వ్యక్తికి తెలియకపోవడం విచారకరమని ఆ లేఖలో పేర్కొంది. విశాఖలో దాదాపు 5 వేల మంది ఆందోళనకారుల మధ్‌య నుంచి చంద్రబాబుకు ఎటువంటి హానీ కలగకుండా కాపాడింది పోలీసులేనని - అలాంటి పోలీసులనే మీ అంతు చూస్తానంటూ మాజీ సీఎం హెచ్చరించడం ఏమిటని ప్రశ్నించింది. తన తండ్రి బాటలోనే లోకేష్ కూడా బెదిరింపు ధోరణిలో మాట్లాడుతున్నారని - తాము అధికారంలోకి వచ్చిన తర్వాత చూసుకుంటాం అనే తీరులో లోకేశ్ మాట్లాడుతున్నారని ఆరోపించారు. ఇకనైనా టీడీపీ నేతలు పోలీసుల పట్ల బెదిరింపులకు పాల్పడే ధోరణి వీడి వాస్తవాలను గ్రహించాలని హితవు పలికారు.