Begin typing your search above and press return to search.
రేపు ఎక్కడెక్కడ ఏయే పోలీసులు ఉంటారు?
By: Tupaki Desk | 6 Dec 2018 3:11 PM GMTరేపటి ఎన్నికల కోసం పోలీస్ శాఖ రెడీ అయింది. 31 జిల్లాల్లో శాంతి భద్రతల పరిరక్షణకు రాష్ట్ర పోలీస్ విభాగం అన్ని చర్యలు తీసుకుంటున్నది. ముందస్తు ఏర్పాట్లలో భాగంగా కేంద్ర ఎన్నికల సంఘం మార్గదర్శకాలకు అనుగుణంగా ప్రధాన కార్యాలయంలోనూ - జిల్లా ప్రధాన కేంద్రాలలోనూ - కమీషనరేట్లలోనూ అన్ని స్థాయిలలోని అధికారులకు శిక్షణా శిబిరాలు నిర్వహించారు. పలు అంశాలపై అవగాహన కల్పించారు. సంక్షోభ నివారణకు సూచనలు ఇచ్చారు.
ఎన్నికల నిర్వహణకు శాంతి భద్రతల అదనపు డీజీపీని నోడల్ అధికారిగా నియమించింది ఈసీ. తీవ్రవాదుల కదలికలు - మత ఘర్షణల ప్రభావం - రాజకీయంగా సున్నితమైన నియోజకవర్గాల వంటి అంశాలపై పకడ్బందీ వ్యూహరచన చేశారు. రాష్ట్రంలో 414 ఫ్లయింగ్ స్క్వాడ్ లు - 404 ఎస్ ఎస్ టీలు - 3,385 మొబైల్ టీమ్స్ నిరంతరం పనిచేస్తుంటాయి.
కీలకమైన పోలీస్ స్టేషన్ల పరిధిలోని ప్రాంతాలలో పొరుగు రాష్ట్రాల నుండి సిబ్బంది రప్పించారు. కేంద్ర దళాలను కూడా రంగంలోకి దించారు. ఈసారి ఎన్నడూ లేనంతగా 11,862 నాన్-బెయిలబుల్ వారంట్లు అమలు చేశారు. ప్రజల్లో విశ్వాసం కలిగించడానికి నాకాబందీ - చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు. నిఘా పెంచారు. ఎన్నికల నియమావళి ఉల్లంఘనలపై ఇప్పటివరకు 1501 ఎఫ్‌ఐఆర్ లు నమోదు చేశారు. కేంద్ర ఎన్నికల సంఘం సూచనల మేరకు అత్యవసర పరిస్థితులలో కీలక ప్రదేశాల్లో దళాలు మోహరించడానికి హెలికాప్టర్లను సిద్ధంగా ఉంచారు.