Begin typing your search above and press return to search.
గ్రౌండ్ రిపోర్ట్: విశాఖ ఇప్పుడెలా ఉంది?
By: Tupaki Desk | 26 Jan 2017 5:36 AM GMTగడిచిన నాలుగైదు రోజులుగా సోషల్ మీడియాలో ఒకటే హడావుడి. ఒకటే చర్చ.ఏం జరుగుతుందన్న ఆసక్తి.. అంతకు మించిన ఉత్కంట. హోదా కోసం విశాఖ ఆర్కే బీచ్ లో నిర్వహించాలని భావించిన మౌన దీక్ష ఎలా జరుగుతుంది?అనంతర పరిణామాలు ఎలా ఉంటాయన్న అంశంపై భారీ చర్చే సాగింది. అందరూ ఎదురు చూసిన రోజు వచ్చేసింది. షెడ్యూల్ ప్రకారం ఈ రోజు (గురువారం)ఉదయం తొమ్మిది గంటలకు ఆర్కే బీచ్ లోని వైఎంసీ దగ్గర మౌనదీక్షను చేపట్టాల్సిఉంది.
అయితే.. ఈ దీక్షకు అనుమతి లేదని చెబుతున్న ఏపీ సర్కారు.. అందుకు తగ్గట్లే భారీ ఏర్పాట్లు చేసింది. అనధికార సమాచారం ప్రకారం దాదాపు ఏడు వేల మందిపోలీసు అధికారుల్ని బీచ్ రోడ్డు దగ్గర పహరా పెట్టినట్లుగా చెబుతున్నారు. పోలీసులతో పాటు.. అక్టోపస్ నుంచి గ్రేహోండ్స్ వరకూ అన్ని విభాగాల పోలీసుల్ని బీచ్ రోడ్డు దగ్గర మొహరించారు. ఒక విధంగా చెప్పాలంటే వైజాగ్ బీచ్ రోడ్డు యావత్ పోలీసుల చేతుల్లోకి వెళ్లిపోయింది.
స్థానికంగా ఉండే వారిని సైతం.. గుర్తింపు కార్డులతోనే అనుమతిస్తున్న పరిస్థితి. బీచ్ మొత్తాన్ని పోలీసులు కమ్మేయటంతో ఆ పరిసరాలు మొత్తం నిర్మానుష్యంగా మారిపోయాయి. కొద్దిమంది ఆందోళకారులు ఉదయం ఎనిమిది గంటల సమయంలో బీచ్ సమీపానికి కొద్దిమంది వచ్చినప్పటికీ వారిని పోలీసులు అనుమతించకపోవటం.. తిరిగి వెళ్లాల్సిందిగా హెచ్చరించటంతో కొద్దిమంది వెళ్లిపోగా.. మరికొందరు ఉండిపోయారు. అయితే.. వీరి సంఖ్య చాలా తక్కువగా ఉందని చెబుతున్నారు.
ఆసక్తికరమైన అంశం ఏమిటంటే.. బీచ్ రోడ్డు ప్రాంతంలోకి మీడియాను కూడా పోలీసులు అనుమతించలేదు. ఇక.. టీవీ ఛానళ్లను.. వారి ఓబీ వ్యాన్లను పోలీసులు అనుమతి నిరాకరించటంతో బీచ్ రోడ్డు వెలవెలబోతోంది. ఉదయాన్నే వాకింగ్ కు వచ్చే వారిని సైతం వెనక్కి పంపించేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకునే అవకాశం ఇవ్వకుడదన్నట్లుగా పోలీసుల తీరుఉందని చెబుతున్నారు. మొత్తంగా చూస్తే.. పోలీసుల పహరాలో విశాఖ బీచ్ రోడ్డు ఉండిపోయింది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆందోళనకు అవకాశం ఇవ్వకూడదన్నట్లుగా పోలీసుల వైఖరి ఉంది. మరోవైపు.. బుధవారం రాత్రి నుంచే నగరంలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతల్ని గృహ నిర్భందంలో ఉంచేయగా.. మరికొందరికి ముందస్తుగా హెచ్చరికలు జారీ చేయటం గమనార్హం. మొత్తంగా విశాఖ మొత్తంలో ఎమర్జెన్సీ పరిస్థితుల్ని తలపించేలా వాతావరణం నెలకొని ఉందని చెప్పాలి.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/