Begin typing your search above and press return to search.

మహా పాదయాత్ర కు పోలీసుల బ్రేకులు

By:  Tupaki Desk   |   29 Oct 2021 7:32 AM GMT
మహా పాదయాత్ర కు పోలీసుల బ్రేకులు
X
న్యాయ స్ధానం నుండి దేవ స్థానం వరకు జరపాలని అనుకుంటున్న పాదయాత్ర కు పోలీసులు బ్రేకులు వేశారు. నవంబర్ లో రాజ ధాని అమరావతి ప్రాంతం నుండి మొదలవ్వబోయే మహా పాద యాత్ర తిరుమల లో శ్రీవారి దర్శనం తో ముగించాలని అమరావతి జేఏసీ నిర్ణయించిన విషయం తెలిసిందే. రాజ ధాని ప్రాంతం లోని జేఏసీ నేతలు, రైతు సంఘాల నేతలు, టీడీపీ మద్దతు దారులతో భారీ పాదయాత్ర కు ప్లాన్ జరిగింది. 47 రోజుల పాటు జరిగే పాదయాత్ర లో శాంతి భద్రతల సమస్య తలెత్తే అవకాశం ఉందని పోలీసులు పాదయాత్రకు అనుమతి ఇవ్వలేదు.

అమరావతి నే ఏపీకి ఏకైక రాజధాని గా కంటిన్యూ చేయాలన్నది అమరావతి జేఏసీ నేతల ప్రధాన డిమాండ్. అమరావతి ప్రాంతం లోని రైతులు, జేఏసీ నేతలు జగన్మోహన్ రెడ్డి ప్రతి పాదించిన మూడు రాజ ధానులను పూర్తి గా వ్యతిరేకిస్తున్నారు. జగన్ ప్రతిపాదన ఆచరణ లోకి రావటానికి సాంకేతిక కారణం మాత్రమే అడ్డు గా నిలిచింది. అమరావతి ప్రాంతం నుండి కర్నూలు కు హై కోర్టు రీ లొకేషన్ విషయం మాత్రమే పెండింగ్ లో ఉంది. దీనికి సుప్రీం కోర్టు కొలీజియం గనుక ఆమోదం తెలిపితే వెంటనే జగన్ ప్రతిపాదించిన మూడు రాజధానుల ప్రక్రియ వెంటనే మొదలైపోతుంది.

ఈ నేపధ్యం లోనే మహా పాదయాత్ర కు అనుమతి కోరుతూ అమరావతి పరి రక్షణ సమితి సెక్రటరీ గద్దె తిరుపతిరావు పోలీసుల కు లేఖ రాశారు. అయితే అనుమతి నిరాకరిస్తూ పోలీసులు తిరుపతి రావు కు లేఖ ద్వారా సమాధానం ఇచ్చారు. ఇదే విషయాన్ని డీజీపీ గౌతమ్ సవాంగ్ మాట్లాడుతూ మహా పాదయాత్ర సాగే మార్గం లో అల్లర్లు జరిగే అవకాశం ఉందన్న అనుమానం తోనే పాదయాత్ర కు అనుమతి ఇవ్వలేదన్నారు.

మూడు రాజధానుల ప్రతిపాదన కు అను కూలంగా ఉన్న ప్రాంతాల్లో మహా పాదయాత్ర జరుగుతున్నపుడు అక్కడి స్థానికుల నుండి అమరావతి డిమాండ్ తో పాదయాత్ర చేస్తున్న వారి పై దాడులు జరిగే ప్రమాదం ఉందన్నారు. దీని వల్ల లా అండ్ ఆర్డర్ సమస్య తలెత్తే అవకాశాలున్నట్లు డీజీపీ అనుమానం వ్యక్తం చేశారు. పాదయాత్ర లో పాల్గొనే వారందరికీ భద్రత కల్పించడం కష్టమన్నారు. అందు కనే ప్రజా ప్రయోజనాల దృష్ట్యా మహా పాదయాత్ర కు అనుమతి నిరాకరిస్తున్నట్లు డీజీపీ స్పష్టం గా చెప్పారు.

అమరావతి పరిరక్షణ సమితి మహా పాదయాత్ర ప్రకటించినపుడే ఇలాంటి దేదో జరుగుతుందని అనుమానాలు మొదలయ్యాయి. ఎందు కంటే అమరావతి నే ఏకైక రాజధానిగా కంటిన్యూ చేయాలనే డిమాండ్ కొన్ని గ్రామాల నుండి మాత్రమే వినిపిస్తోంది. ఇదే సమయం లో మిగిలిన జిల్లాల్లో అమరావతి డిమాండు ను పట్టించుకోవటమే లేదు. ఈ నేపధ్యం లోనే ఇతర ప్రాంతం లోని స్థానికులు, లేదా అధికార పార్టీ శ్రేణుల నుండి ప్రతి ఘటన ఎదురయ్యే అవకాశాలు లేకపోలేదు. ఈ విషయాన్నే డీజీపీ స్పష్టం చేశారు. అయితే అమరావతి పరి రక్షణ సమితి కోర్టుకెళ్ళి అనుమతి తెచ్చుకునే ప్రయత్నాల్లో ఉంది. మరి కోర్టు ఏమి చెబుతుందో చూడాలి.