Begin typing your search above and press return to search.

నోటి దురద రమ్యపై క్రిమినల్ కేసు

By:  Tupaki Desk   |   10 Sep 2016 8:53 AM GMT
నోటి దురద రమ్యపై క్రిమినల్ కేసు
X
కొంతమంది కేవలం వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం ద్వారానే లీడర్లు అయిపోదాం అనుకుంటూ ఉంటారు. అలాంటి వ్యాఖ్యలతో తరచుగా వార్తల్లో నిలుస్తుంటే గొప్ప స్థాయికి వెళ్లిపోతాం అనుకుంటూ ఉంటారు. ఐతే సుబ్రమణ్యస్వామి లాంటి కంటెంట్ ఉన్న వ్యక్తులు ఏం మాట్లాడినా చెల్లుతుంది కానీ.. మిడిమిడి జ్నానంతో మాట్లాడే కన్నడ నటి రమ్య లాంటి వాళ్లతోనే వస్తుంది ఇబ్బంది. అనుకోకుండా అదృష్టం కలిసొచ్చి కొన్ని నెలల పాటు ఎంపీ పదవి వెలగబెట్టి.. ఆ తర్వాత ఎన్నికల్లో ఓడి ఇంటికే పరిమితమైన రమ్య.. ఈ మధ్య తరచుగా వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలిచే ప్రయత్నం చేస్తున్న సంగతి తెలిసిందే.

పాకిస్థాన్ నరకం కాదంటూ ఆమె ఇటీవల చేసిన వ్యాఖ్యలపై దుమారం రేగిన సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యలకు సంబంధించి క్రిమనల్ కేసు నమోదు చేయాలని స్థానిక కోర్టు పోలీసులకు ఆదేశాలివ్వడం తెలిసిందే. తాజాగా ఆర్ఎస్ఎస్ బ్రిటీష్ వారికి స‌హ‌క‌రించిందంటూ రమ్య చేసిన వ్యాఖ్యలు వివాదానికి కారణమయ్యాయి. ఆ వ్యాఖ్యలపై వసంత్ మరకడ అనే న్యాయవాది కోర్టులో ప్రైవేట్ పిటిషన్ వేశాడు. రమ్యపై చర్య తీసుకోవాలని ఆయన మంగళూరు సమీపంలోని బెల్తాన్ గడి కోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. ముందు ఆమెపై కేసు నమోదు చేయాలని పోలీసులకు ఫిర్యాదు చేయగా.. వాళ్లు అందుకు అంగీకరించలేదు. దీంతో వసంత్ కోర్టును ఆశ్రయించాడు. కోర్టు వసంత్ స్టేట్ మెంట్ ను రికార్డు చేసిన కోర్టు రమ్యపై క్రిమినల్ కేసు నమోదు ఆదేశాలు ఇచ్చింది. రమ్యకు సమన్లు జారీ అయ్యే అవకాశాలున్నట్లు వసంత్ తెలిపాడు. ఓ ర్యాలీ సందర్భంగా రమ్య మాట్లాడుతూ.. దేశానికి స్వాతంత్ర్యం భాజపా వల్లో.. ఆరెస్సెస్ వల్లో రాలేదని.. కాంగ్రెస్ వల్ల వచ్చిందని పేర్కొంది. అంతటితో ఆగకుండా భాజపా.. ఆరెస్సెస్ బ్రిటిష్ వారికి సహకరించాయని ఆరోపించింది.