Begin typing your search above and press return to search.
భర్తకు తెలీకుండా నిక్కీ ఎంత చేసిందంటే.?
By: Tupaki Desk | 13 Sep 2015 11:17 AM GMTకుటుంబం కోసం ఇంటి పెద్ద అయిన మొగుడు కిందామీదా పడుతూ ఉంటే.. ఇంట్లో ఉండి పిల్లల్ని చూసుకోవాల్సిన భార్యలు చేస్తున్న చేష్టలు షాకింగ్ గా మారిన సంగతి తెలిసిందే. గత కొద్దిరోజులుగా దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన షీనా బోరా హత్య కేసులోదేవయాని చేసిన యవ్వారాలు చూసిన వారంతా షాక్ తినే పరిస్థితి.
తన గత చరిత్రను ఏ మాత్రం తెలీకుండానే స్టార్ టీవీకి అత్యంత కీలకమైన వ్యక్తిని (ఇప్పుడు మాజీ) పెళ్లి వరకూ తీసుకెళ్లటం.. తన కూతుర్ని చెల్లెలుగా పరిచయం చేయటం.. ఆపై చంపేయటం లాంటి చేష్టలెన్నో చేసిన దేవయాని వ్యవహారం ఎందరినో దిగ్భాంత్రికి గురి చేసింది.
ఈ షాక్ నుంచి ఇంకా కోలుకోక ముందే ఇలాంటి యవ్వారమే మరొకటి బయటకు వచ్చింది. తాజాగా శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో పోలీసులు అదుపులోకి తీసుకున్న నిక్కీ జోసెఫ్ అలియాస్ అప్సా జూబియన్ వ్యవహారం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
ముగ్గురు కుమార్తెలకు తల్లి అయిన నిక్కీ.. ఇంటి బాధ్యతలు చూస్తున్నట్లే చూసి.. నరరూప రాక్షసుల్లాంటి ఐసిస్ కు యువకుల్ని రిక్రూట్ చేసే పనిలో బిజీగా ఉండటం గమనార్హం. కుటుంబ పోషణ కోసం దుబాయ్ లోని ఒక స్థిరాస్తి కంపెనీలో ఉద్యోగిగా వ్యవహరిస్తున్న నిక్కీ భర్త దేవేంద్ర బాత్రా (పెళ్లితో మతం మార్చుకొని ప్రస్తుతం ముస్తఫా) ఉద్యోగం కోసం నిత్యం 15 కిలోమీటర్లు నడిచి వెళుతూ.. కుటంబ పోషణ కోసం కిందామీదా పడుతున్నారు.
మరోవైపు.. నిక్కీ మాత్రం ఇంట్లో కూర్చొని సామాజిక వెబ్ సైట్ల ద్వారా.. ఢిల్లీ.. కాశ్మీర్ యువకులతో ఛాటింగ్ చేస్తూ.. వారిని ఉగ్రవాద కార్యకలాపాల వైపు ఆకర్షించేలా వ్యవహరించటం గమనార్హం. భర్తకు తెలీకుండానే ఈ కిలేడీ చేసిన పనులు విని ఇప్పుడామె భర్త షాక్ తింటున్నారు. ఢిల్లీ..కాశ్మీర్ యువకుల్ని సోషల్ నెట్ వర్క్స్ ద్వారా ఆకర్షించి.. వారిని ఐసిస్ వైపు వెళ్లేలా వ్యవహరిస్తున్న ఆమె వ్యవహారం తెలియటంతో ఒక్కసారిగా ఆమె భర్త షాక్ తిన్న పరిస్థితి.
ప్రస్తుతం చర్లపల్లి జైల్లో ఉన్న ఆమెను విచారణ నిమిత్తం పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. విచారణలో ఆమె చెబుతున్న సమాచారం పోలీసులకు సైతం షాకింగ్ గా ఉందని చెబుతున్నారు. అయితే.. ఆమె వెల్లడించిన సమాచారం ఎట్టి పరిస్థితుల్లోనూ బయటకు పొక్కేకూడదని భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఆమెను మరింత విచారించాల్సిన అవసరం ఉందని.. ఆమె చెబుతున్నాసమాచారంతో ఉగ్రజాడలకు సంబంధించి చాలానే విషయాలు బయటకు వస్తున్నట్లుగా చెబుతున్నారు. మొత్తానికి భర్తల్ని ఏమార్చి భార్యలు చేస్తున్న విపరీత చర్యలు షాక్ తినేలా ఉండటం గమనార్హం.