Begin typing your search above and press return to search.
మంత్రి పేర్ని నానిపై హత్యాయత్నం ... నిందుతుడి కాల్ లిస్ట్ పరిశీలిస్తున్న పోలీసులు !
By: Tupaki Desk | 2 Dec 2020 12:15 PM GMTఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రవాణా, సమాచార శాఖ మంత్రి పేర్ని నానిపై హత్యాయత్నం జరిగిన సంగతి తెలిసిందే. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణను వేగ వంతం చేశారు. మంత్రి పేర్ని నానిపై హత్యాయత్నం చేసిన నిందితుడు నాగేశ్వరరావుపై సెక్షన్ 307 కింద పోలీసులు కేసు నమోదు చేశారు. జిల్లా ఎస్పీ రవీంద్రనాథ్ బాబు ఆధ్వర్యంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ ఎస్పీ వకుల్ జిందాల్ పర్యవేక్షణలో 4 బృందాలు కేసును దర్యాప్తు చేస్తున్నాయి.
ఇక మంగళవారం మంత్రిపై జరిగిన హత్యాయత్నం సమయంలో సీసీటీవీ కెమెరాల్లో రికార్డ్ అయిన ఫుటేజ్ ను బయటపెట్టారు. పక్కా ప్లాన్ తోనే నాగేశ్వరరావు, మంత్రి ఇంటి వద్ద కాపు కాసి దాడి చేసినట్టు స్పష్టంగా తేలింది. దీనితో నిందితుడు నాగేశ్వరరావు కాల్ లిస్ట్‌ను పరిశీలించారు. కాల్ లిస్ట్ సంభాషణలపై విచారణ చేస్తున్నారు. నిందితుడు నాగేశ్వరరావు విచారణలో చెప్పిన టీడీపీ నేతలు మరకాని వరబ్రహ్మం, జిమ్ శివ, మాదిరెడ్డి శ్రీనులకు నోటీసులిచ్చి విచారించారు. ఎప్పుడు పిలిచినా పోలీస్ స్టేషన్ కు రావాలన్న షరతుతో విడిచి పెట్టారు. నాగేశ్వరరావు సోదరి బడుగు ఉమాదేవిని కూడా మరోసారి పిలిచి విచారించారు.
నాగేశ్వరరావు నుండి పూర్తి వివరాలు రాబట్టాల్సి ఉందని మూడు రోజులు కస్టడీ కోరుతూ పోలీసులు కోర్టులో మెమో ఫైల్ దాఖలు చేసారు. ఘటన అనంతరం మంత్రి పేర్నినాని ఇంటి వద్ద భద్రతను పెంచారు. స్కానర్లు, మెటల్ డిటెక్టర్లు ఏర్పాటు చేశారు. మంత్రిని కలవడానికి వచ్చే ప్రతి ఒక్కరినీ భద్రతా సిబ్బంది క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు.