Begin typing your search above and press return to search.
రాపాక హల్ చల్..పేకాట రాయుళ్లకు వత్తాసు..కేసు నమోదు
By: Tupaki Desk | 13 Aug 2019 6:08 AM GMTసమాజంలో మార్పు తెస్తామని - సుభిక్షమైన రాజకీయాలు చేస్తామని పదే పదే చెప్పుకొచ్చిన జనసేన అధి నేత పవన్ కళ్యాణ్.. తన టీంను కూడా అలానే ఉంచుతారని ఎవరైనా అనుకుంటారు. నిజాయితీ - నిప్పు అంటూ.. ఇటీవల ఎన్నికల్లో ప్రత్యేక ప్రకటనలు చేసిన ఆయన ఆదర్శానికి కేరాఫ్ గా నిలిచానని చెప్పుకొచ్చారు. మరి అలాంటి పార్టీలో ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఏకైక ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ రాజోలు నుంచి విజయం సాధించారు. నిదానస్తుడు - సౌమ్యుడు - మితభాషిగా పేరు తెచ్చుకున్న రాపాక.. తాజాగా పోలీసు కేసు నమోదైంది.
ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లోనూ చాలా హుందాగా ప్రవర్తించిన రాపాక.. తనదైన శైలిలో విమర్శలు చేశారు. అదేసమయంలో రెండు నెలలు కూడా నిండని ప్రభుత్వంపై విమర్శలు చేయడం తగదని అన్నా రు. ఇక, పవన్ చూపిన బాటలో నడుస్తానని స్పష్టం చేశారు. అయితే, ఈయన తాజాగా కేసులో ఇరుక్కోవడం, ఈ నేపథ్యంలో ఆదివారం రాత్రంతా కూడా పెద్ద ఎత్తున హైడ్రామా చోటు చేసుకోవడం వంటివి ఆసక్తిగా మారాయి. పేకాడుతున్న వారికి వత్తాసు పలకడమే కాకుండా పోలీస్‌స్టేషన్ పై దౌర్జన్యానికి దిగి ప్రభుత్వ ఆస్తిని నష్టపరిచారనే అభియోగాలతో రాపాక వరప్రసాద్ - అతని అనుచరులపై పోలీసులు కేసు నమోదు చేశారు.
తూర్పుగోదావరి జిల్లా రాజోలు నియోజకవర్గం పరిధిలోని మలికిపురంలో ఆదివారం పేకాడుతున్న 9 మం దిని ఎస్ ఐ కేవీ రామారావు అరెస్టు చేశారు. ఈ క్రమంలో నిందితులను విడిచిపెట్టాలని ఎమ్మెల్యే రాపాకతో పాటు అతని అనుచరుడు గెడ్డం తులసి భాస్కర్ ఎస్‌ఐతో ఘర్షణ పడడమే కాకుండా, సుమారు 100 మందితో కలిసి పోలీస్ స్టేషన్ పైకి రాళ్ళు రువ్వి స్టేషన్ కిటికీ అద్దాలు పగులగొట్టారని - పోలీసు విధులకు ఆటంకం కలిగించారని ఎస్పీ పేర్కొన్నారు. ఈ మేరకు ఎమ్మెల్యేతోపాటు - ఆయన అనుచరులపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు.
గతంలోనూ రాపాకపై రెండు కేసులు ఉన్నాయని ఎస్పీ తెలిపారు. అయితే, ఈ క్రమంలో చాలా నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయని పరిశీలకులు అంటున్నారు. ఏదే మైనా.. పవన్ పార్టీలోని ఏకైక ఎమ్మెల్యే ఇలా పేకాట రాయుళ్లకు వత్తాసు పలకడం అనేది కొంత ఇబ్బందికరమే అంటున్నారు. మరి దీనిపై పవన్ ఎలా స్పందిస్తారో.. ఎలా రాజకీయం చేస్తారో చూడాలి.