Begin typing your search above and press return to search.

‘‘తుని’’ ఇష్యూపై కేసులే కేసులు

By:  Tupaki Desk   |   4 Feb 2016 5:30 AM GMT
‘‘తుని’’ ఇష్యూపై కేసులే కేసులు
X
తూర్పుగోదావరి జిల్లా ‘తుని’లో ఆదివారం నిర్వహించిన కాపు ఐక్య గర్జన.. అనంతరం చోటుచేసుకున్న పరిణామాలు తెలిసిందే. కాపుల్ని బీసీల్లోకి చేర్చాలన్న డిమాండ్ తో నిర్వహించిన బహిరంగ సభ..అనంతరం హింసాత్మకంగా మారింది. తుని రైల్వే స్టేషన్లో రత్నాచల్ ఎక్స్ ప్రెస్ రైలుపై దాడి.. అనంతరం దాన్ని దగ్థం చేయటంతో పాటు.. తునిలోని రెండు పోలీస్ స్టేషన్లపై దాడి చేసి.. ధ్వంసం చేసిన ఘటనలతో పాటు.. పెద్ద ఎత్తున వాహనాల్ని దగ్థం చేసిన ఉదంతాలకు సంబంధించిన కేసుల పర్వం షురూ అయ్యింది.

ఈ ఇష్యూలో కాపు ఉద్యమనేత.. మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభంపై 67 కేసుల్ని నమోదు చేయటమే కాదు.. గర్జనకు హాజరైన పలువురు నేతలపైనా భారీగా కేసులు నమోదు చేయటం ఇప్పుడు వివాదాస్పదంగా మారుతోంది. ముద్రగడ పద్మనాభంతో పాటు.. 27 మంది కాపు నేతలపై కేసులు బుక్ చేశారు. వీరిలో మాజీ కేంద్రమంత్రులు మొదలు.. మాజీ మంత్రులు.. పలు ఉన్నత పదవులు చేపట్టిన వారు ఉండటం గమనార్హం.

కాపు గర్జనలో చోటు చేసుకున్న హింస అంతా కల్పితమని.. కొందరు విద్రోహులు సృష్టించిన ఆరాచకమని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పుకొచ్చారు. కొందరు విద్రోహులు ప్లాన్ ప్రకారం చేసిన పనిని ఆయన తీవ్రంగా ఖండించటంతో పాటు.. ఏపీ విపక్ష నేతపై పరోక్షంగా పలు ఆరోపణలు చేశారు. ఇదిలా ఉంటే.. చంద్రబాబు ఆరోపణలకు భిన్నంగా ఐక్యగర్జనకు హాజరైన పలువురు కాంగ్రెస్.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలపై కేసులు నమోదు కావటం ఇప్పుడు రాజకీయ వివాదంగా మారింది. కక్ష సాధింపు చర్యల కోసం బాబు సర్కారు పని చేస్తుందన్న విమర్శలు మొదలయ్యాయి. తాజాగా కేసులు నమోదైన నేతలపై పలువురు చేస్తున్న వాదన ఏమిటంటే.. కాపు గర్జనకు వివిధ పార్టీలకు చెందిన నేతలు హాజరయ్యారని.. అయితే.. సభ స్టార్ట్ కాగానే.. రైలు రోకో.. రాస్తారోకో అంటూ పిలుపునిచ్చిన ముద్రగడ తీరుతో షాక్ కు గురై.. తమ దారిన తాము వెళ్లిపోయారని చెబుతున్నారు.

కాపు గర్జనకు హాజరు కావటమే పాపమన్నట్లుగా బాబు సర్కారు వ్యవహరిస్తుందన్న అబిప్రాయాన్ని వారు వ్యక్తం చేస్తున్నారు. ఐసీపీ సెక్షన్లు19/16, 120(బి).. పోలీస్ యాక్ట్ సెక్షన్లు 7(1).. 307.. 71తో పాటు మరిన్ని సెక్షన్లును పెట్టినట్లుగా చెబుతున్నారు. ఇలా కేసులు నమోదైన నేతల్లో కొందరు సభకు కూడా హాజరు కాలేదన్న మాట వినిపిస్తోంది. దీనిపై పోలీసులు వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరోవైపు.. టీడీపీ నేతల పేర్లు కూడా జాబితాలో ఉన్నాయని.. కేసులన్నీ నిష్పక్షపాతంగా నమోదు చేస్తున్నట్లుగా చెబుతున్నారు.

కాపు ఐక్య గర్జనకు హాజరై.. పలు కేసులు నమోదైన నేతల్ని చూస్తే..

= కేంద్ర మాజీ మంత్రి పళ్లం రాజు

= మాజీ మంత్రి బొత్స సత్యానారాయణ

= మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ

=మాజీ మంత్రి వట్టి వసంతకుమార్

= మాజీ ఎమ్మెల్సీ గంగా భవాని (కాంగ్రెస్)

= కాంగ్రెస్ ఎంపీ వి హనుమంతరావు(తెలంగాణ)

= తుని ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా

= వైఎస్సార్ పార్టీ జిల్లా అధ్యక్షుడు.. శాసనసభాపక్ష ఉప నేత జ్యోతుల నెహ్రు

= ప్రత్తిపాడు ఎమ్మెల్యే వరుపుల సుబ్బారావు

= వైఎస్సార్ కాంగ్రెస్ నేత అంబటి రాంబాబు

= మాజీ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు

= ఎంఎస్ ఆర్ నాయుడు (నం.1 ఛానల్ ఎండీ)

= బండారు శ్రీనివాసరావు (టీడీపీ)

= జక్కంపూడి విజయలక్ష్మీ

= కొప్పన మోహనరావు

= అడపా నాగేంద్ర (బీజేపీ-విజయవాడ)

= నల్లా పవన్ (బీజేపీ – అమలాపురం)

= ఎల్లా దొరబాబు (బీజేపీ)

కాపు నేతలు..

= నల్లా విష్ణు

= ఆకుల రామకృష్ణ

= వాసిరెడ్డి ఏసుదాసు

= జీవీ సుధాకర్ తో పాటు పలువురు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తదితరులు