Begin typing your search above and press return to search.

బుల్లెట్ బండికి ఫైన్ వేసిన పోలీస్.. ఎందుకో తెలిస్తే అవాక్కే?

By:  Tupaki Desk   |   28 July 2022 5:34 AM GMT
బుల్లెట్ బండికి ఫైన్ వేసిన పోలీస్.. ఎందుకో తెలిస్తే అవాక్కే?
X
రోడ్డుపై రూల్స్ అతిక్రమిస్తే.. హెల్మెట్ సహా లైసెన్స్ గట్రా లేకపోతే పోలీసులు ఫైన్ వేస్తారు. ఈ మధ్య రోడ్డుపై ఎలా వెళ్లినా.. రాష్ డ్రైవింగ్ అంటూ ఏవేవో ఫైన్లు వేస్తూనే ఉన్నారు. నెలలో బైక్ పై ఒక చలానా అయినా పడుతోంది. అయితే కేరళలలో జరిగిన ఓ ఘటన అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. రాయల్ ఎన్ ఫీల్డ్ బైక్ కు ఫైన్ వేసిన ట్రాఫిక్ పోలీస్ పేర్కొన్న కారణాన్ని చూసిన యజమాని మైండ్ బ్లాంక్ అయ్యింది.

ఇంతకీ విషయం ఏంటంటే? కేరళకు చెందిన బసిల్ శ్యామ్ అనే వ్యక్తి తన రాయల్ ఎన్ ఫీల్డ్ బైక్ పై ఇంటి నుంచి ఆఫీసుకు బయలుదేరి వెళ్లాడు. ఆ సమయంలో బసిల్ శ్యామ్ వన్ వేలో రాంగ్ రూట్ లో నడిపాడు. ఇది గమనించిన ఓ ట్రాఫిక్ పోలీస్ బైక్ ఆపి రూ.250 ఫైన్ కట్టమని అన్నాడు.దీంతో బసిల్ శ్యామ్ ఫైన్ మొత్తాన్ని ఇచ్చి.. ట్రాఫిక్ పోలీస్ ఇచ్చిన రిసిప్ట్ ను తీసుకొని ఆఫీసుకు వెళ్లిపోయారు.

తీరా ఆఫీస్ కు వెళ్లాక రిసిప్ట్ చూసిన బసిల్ శ్యామ్ షాక్ తిన్నాడు. దీనికి కారణం.. బైక్ లో సరిపడా పెట్రోల్ లేని కారణంగా ఫైన్ వేసినట్లు ఆ రిసిప్ట్ లో ఉంది. ఆ రిసిప్ట్ ను ఫొటో తీసి ఫేస్ బుక్ లో పోస్ట్ చేశాడు. దీంతో ఇది కాస్తా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. నెట్టింట తెగ సందడి చేస్తోంది.

ఇక ఇదిలా ఉంటే.. సరిపడా ఇంధనం లేకపోతే ఫైన్ వేయాలన్న నిబంధన ఎక్కడా లేదు. ఆ పోలీస్ ఎందుకు వేశాడో? తప్పుగా జరిగిందో తెలియదు.

కేరళ చట్టం ప్రకారం.. బస్సు, కారు, ఆటో వంటి కమర్షియల్ వాహనాల్లో సరిపడా డీజిల్, పెట్రోల్ లేకపోతే ఫైన్ వేయవచ్చనే పాయింట్ కూడా ఉంది. దీనికి కారణం ఇంధనం లేకపోవడం వల్ల వాహనం మధ్యలో ఆగిపోయే అవకాశం ఉంటుంది. ఇది ప్రయాణికులకు ఇబ్బందిగా మారుతుందనే ఉద్దేశంతోనే ఈ పాయింట్ ను జతచేసినట్టు తెలిసింది.

అయితే ఇది బైక్ లకు వర్తించదు.. ఈ లెక్కన చూస్తే బసిల్ శ్యామ్ కు రాంగ్ రూట్ కు వేయాల్సిన ఫైన్ ను ఇలా సరిపడా ఇంధనం లేదని వేసినట్టు అర్థమవుతోంది.